ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్‌రాజు మృతి
ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్‌రాజు (68) మంగళవారం అర్థరాత్రి 1 గంటకు (తెల్లారితే బుధవారం) మృతి చెందారు. గత కొంత కాలంగా లివర్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మంగళవారం కూడా ఆసుపత్రికి వెళ్లి డాక్టర్‌ను సంప్రదించారు. అనంతరం ఇంటికి వచ్చిన ఆయన అర్థరాత్రి సమయంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయన మరణ వార్త తెలుసుకొని సినీ పరిశ్రమ విషాదంలో మునిగిసోయింది. కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు […]
ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్‌రాజు (68) మంగళవారం అర్థరాత్రి 1 గంటకు (తెల్లారితే బుధవారం) మృతి చెందారు. గత కొంత కాలంగా లివర్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మంగళవారం కూడా ఆసుపత్రికి వెళ్లి డాక్టర్‌ను సంప్రదించారు. అనంతరం ఇంటికి వచ్చిన ఆయన అర్థరాత్రి సమయంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయన మరణ వార్త తెలుసుకొని సినీ పరిశ్రమ విషాదంలో మునిగిసోయింది. కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.
గౌతమ్‌రాజు 1954 జనవరి 15న చెన్నై (అప్పటి మద్రాసు)లో జన్మించారు. 1981 విడుదలైన చట్టానికి కళ్లు లేవు సినిమాతో ఎడిటర్‌గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1982లో విడుదలైన నాలుగు స్తంభాలాట సినిమా ఆయనకు మంచి పేరు తీసుకొని వచ్చింది. గౌతమ్‌రాజు ఇప్పటి వరకు 800పైగా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలకు పని చేశారు. ఎంతో మంది హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు ఆయన ఫేవరెట్ ఎడిటర్ అని పరిశ్రమలో చెప్పుకుంటారు.
ఆనంద భైరవి (1983), దళపతి (1991), బ్రహ్మ (1992), సూర్యవంశం (1999), అమ్మాయి కోసం (2001), చెన్నకేశవ రెడ్డి (2002), దిల్ (2003), అతనొక్కడే (2005), లక్ష్మి (2006), డాన్ సీను (2010), ఒక్క అమ్మాయి తప్ప (2016), కాటమరాయుడు (2017)తో పాటు గబ్బర్ సింగ్, గోపాల గోపాల, అదుర్స్, ఆది, ఖైది నెంబర్ 150, కిక్, రేసుగుర్రం, రచ్చ, ఊసరవెల్లి, బద్రీనాథ్ వంటి హిట్ చిత్రాలకు పని చేశారు. తెలుగులో టాప్ ఎడిటర్లలో ఒకరైన గౌతమ్‌రాజు నిత్యం బిజీగా ఉండేవారు. చాలా ఫాస్ట్‌గా ఎడిటింగ్ చేస్తారని గౌతమ్‌రాజు పేరున్నది. ఆది సినిమాకు ఆయన ఉత్తమ ఎడిటర్‌గా నంది అవార్డు అందుకున్నారు.
గౌతమ్‌రాజు మృతిపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేశారు.