‘కాళీ మూవీ మేకర్ తల తీస్తాం’.. అయోధ్య స్వామీజీ హెచ్చరిక

‘కాళీ’ మూవీ మేకర్ లీనా మణిమేఖలైకి బెదిరింపులు పెరిగిపోతున్నాయి. సిగరెట్ తాగుతున్నట్టున్న కాళీమాత పోస్టర్ పెద్దఎత్తున వివాదాస్పదమవుతోంది. హిందూ దేవతలను అవమానిస్తున్నారంటూ అనేకమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టర్ ని, ఈ మూవీని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లీనా మణిమేఖలైని అరెస్టు చేయాలని కోరుతున్నారు. తాజాగా అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయ మహంత్ రాజుదాస్ ఈ మూవీపైన, లీనాపైన మండిపడ్డారు. నూపుర్ శర్మ నిజమే మాట్లాడితే దేశ వ్యాప్తంగానే గాక ప్రపంచ వ్యాప్తంగా కూడా […]

Advertisement
Update:2022-07-06 04:16 IST

‘కాళీ’ మూవీ మేకర్ లీనా మణిమేఖలైకి బెదిరింపులు పెరిగిపోతున్నాయి. సిగరెట్ తాగుతున్నట్టున్న కాళీమాత పోస్టర్ పెద్దఎత్తున వివాదాస్పదమవుతోంది. హిందూ దేవతలను అవమానిస్తున్నారంటూ అనేకమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టర్ ని, ఈ మూవీని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లీనా మణిమేఖలైని అరెస్టు చేయాలని కోరుతున్నారు. తాజాగా అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయ మహంత్ రాజుదాస్ ఈ మూవీపైన, లీనాపైన మండిపడ్డారు. నూపుర్ శర్మ నిజమే మాట్లాడితే దేశ వ్యాప్తంగానే గాక ప్రపంచ వ్యాప్తంగా కూడా నిరసనలు పెల్లుబికాయని, కానీ నువ్వు (లీనా) భారత సనాతన ధర్మాన్ని అవమానపరచాలని చూస్తున్నావని ఆయన ఆరోపించారు.

నీకేం కావాలి ? నీ తల కూడా నీ శరీరం నుంచి వేరు కావాలనుకుంటున్నావా? అని ఆయన ప్రశ్నించారు. నీకిదేనా కావలసింది అని రెట్టించారు. నీ సినిమా పోస్టర్ దారుణంగా ఉందని, అసలీ మూవీ సనాతన ధర్మాన్ని, హిందూ దేవతలను అవమానపరచేదిగా ఉందని రాజు దాస్ ఆగ్రహంతో రెచ్చిపోయారు. కాళీ సినిమా మేకర్ పై కఠిన చర్య తీసుకోవాలని, ఈ చిత్రాన్ని నిషేధించాలని ఆయన కేంద్ర హోం శాఖను కోరారు. లేనిపక్షంలో మీరు అదుపు చేయలేని పరిస్థితిని సృష్టిస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. లీనా మణిమేఖలై ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని, కానీ కాళీ మూవీ రిలీజైతే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని ఈ స్వామీజీ ఆమెకు కూడా వార్నింగ్ ఇచ్చారు. యువజన కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి శరద్ శుక్లా సైతం ఈ చిత్రాన్ని ఖండిస్తూ ఇలాంటి డాక్యుమెంటరీలు, వెబ్ సీరీస్ లను తీసేవారిని అరెస్టు చేసి జైల్లో పెట్టాలన్నారు. తక్షణమే వీరిపై కేసులు నమోదు చేయాలని ఆయన కోరారు.

కెనడా మ్యూజియం అపాలజీ
కాళీ మూవీ సినిమా, పోస్టర్ పై భారత హైకమిషన్ తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో కెనడా (టొరంటో) లోని ఆగా ఖాన్ మ్యూజియం ఇండియాకు క్షమాపణ చెప్పింది. ఇది హిందూ సెంటిమెంట్లను, హిందూ దేవతలను అవమానపరచేవిధంగా ఉన్నట్టు తమకు అనేకవర్గాల నుంచి ఫిర్యాదులవంటివి అందాయని, కానీ ఎవరినీ కించపరచాలన్నది తమ ఉద్దేశం కాదని పేర్కొంది. ‘అండర్ ది టెంట్’ పేరిట తమకు అందిన 18 స్వల్ప కాలిక వీడియోల్లో (డాక్యుమెంటరీల్లో) ఈ సోషల్ మీడియా పోస్ట్ కూడా ఉందని, కానీ ఇది హిందువులను, ఇతర వర్గాలను . బాధ పెట్టినందుకు విచారం వ్యక్తం చేస్తున్నామని ఈ మ్యూజియం వర్గాలు పేర్కొన్నాయి.

Tags:    
Advertisement

Similar News