చైనాకు చెందిన మొబైల్ కంపెనీపై ఈడీ దాడులు… 44 చోట్ల సోదాలు

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వివో, దాని అనుబంధ సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దేశవ్యాప్తంగా 44 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA)లోని పలు సెక్షన్ల కింద సోదాలు జరుగుతున్నాయని, వివో దాని అనుబంధ కంపెనీలకు సంబంధించిన 44 చోట్ల ఏజెన్సీ సోదాలు నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, హర్యానా, బిహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. రెండు చైనా కంపెనీలు నకిలీ చిరునామాలు, నకిలీ పత్రాలతో […]

Advertisement
Update:2022-07-05 10:21 IST

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వివో, దాని అనుబంధ సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దేశవ్యాప్తంగా 44 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు.

ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA)లోని పలు సెక్షన్ల కింద సోదాలు జరుగుతున్నాయని, వివో దాని అనుబంధ కంపెనీలకు సంబంధించిన 44 చోట్ల ఏజెన్సీ సోదాలు నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు.

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, హర్యానా, బిహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. రెండు చైనా కంపెనీలు నకిలీ చిరునామాలు, నకిలీ పత్రాలతో అక్రమాలకు పాల్పడినట్టు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తించిన తర్వాత ఈడీ ఈ చర్యలు చేపట్టింది. వివో మొబైల్ కమ్యూనికేషన్స్, ZTE కార్పోరేషన్ లు ఇప్పటికే ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్నాయి. మరో చైనా మొబైల్ కంపెనీ షావోమిని కూడా ఈడీ విచారిస్తున్నది.

Tags:    
Advertisement

Similar News