చిరుకు జగన్ బంపరాఫర్?
వచ్చే ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు సీటులో వైసీపీ తరఫున పోటీ చేయాలని మెగాస్టార్ చిరంజీవికి వైఎస్ జగన్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణ సభలో పాల్గొనేందుకు ప్రధాని కార్యాలయం నుంచి చిరంజీవికి ఆహ్వానపత్రం అందింది. దీంతో మెగాస్టార్ మోదీతో పాటు ఈ సభకు హాజరయ్యారు. ఈ సభలోనే జగన్, చిరంజీవిలు ఆలింగనం చేసుకుని వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ప్రజలంతా చూసేలా చేశారు. అంతకుముందు సినిమా టికెట్ రేట్లు పెంచుకునే విషయంలో […]
వచ్చే ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు సీటులో వైసీపీ తరఫున పోటీ చేయాలని మెగాస్టార్ చిరంజీవికి వైఎస్ జగన్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణ సభలో పాల్గొనేందుకు ప్రధాని కార్యాలయం నుంచి చిరంజీవికి ఆహ్వానపత్రం అందింది.
దీంతో మెగాస్టార్ మోదీతో పాటు ఈ సభకు హాజరయ్యారు. ఈ సభలోనే జగన్, చిరంజీవిలు ఆలింగనం చేసుకుని వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ప్రజలంతా చూసేలా చేశారు. అంతకుముందు సినిమా టికెట్ రేట్లు పెంచుకునే విషయంలో కూడా వైఎస్ జగన్ను ఒప్పించేలా చేయడంలో చిరంజీవి పాత్ర కీలకంగా ఉంది.
ప్రస్తుతం నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వైసీపీలో గెలిచి..రోజూ ప్రభుత్వాన్ని జగన్‌మోహన్‌రెడ్డిని, ఎంపీ విజయసాయిరెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. జగన్ ప్రభుత్వం కూడా రఘురామరాజును అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో ఆ సీటు ఎట్టిపరిస్థితుల్లో గెలిచి తీరాలన్న కసి, పట్టుదల జగన్‌లో ఉంది. దీన్నే వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వద్ద కూడా వెలబుచ్చినట్లు సమాచారం.
పీకే వ్యూహంలో భాగంగా నరసాపురం పార్లమెంటు స్థానాన్ని చిరంజీవికి ఇవ్వడం వల్ల అటు రఘురామకృష్ణంరాజుకు, ఇటు పవన్ కళ్యాణ్‌కు ఇద్దరికీ చెక్ పెట్టినట్లు అవుతుందని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని వైఎస్ జగన్ స్వయంగా చిరంజీవి వద్ద వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
అయితే చిరంజీవి మాత్రం జగన్ ఆఫర్‌ను అంగీకరించినట్లుకానీ, తిరస్కరించినట్లు కానీ చెప్పకుండా ఓ చిరునవ్వి నవ్వారని టాక్. ఎన్నికల సమయానికి ఎలాగైనా చిరంజీవిని వైసీపీ పార్టీలోకి తెచ్చి పోటీ చేయించడం వల్ల ఉభయ గోదావరి జిల్లాల కాపుల ఓట్లు కూడా మరింతగా జగన్‌కు కలిసొస్తాయన్నది వ్యూహంగా కనిపిస్తోంది.