హిందూ దేవుళ్ల బొమ్మలున్న న్యూస్ పేపర్‌తో పొట్లం కట్టాడని హోటల్ ఓనర్ అరెస్టు

హిందూ దేవుళ్ల బొమ్మలు ఉన్న న్యూస్ పేపర్‌తో మాంసాహార పదార్థాలు పొట్లం కడుతున్నాడనే నెపంతో యూపీలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. యూపీలోని సంభాల్ జిల్లా కేంద్రంలో మహ్మద్ తాలిబ్ అనే వ్యక్తి 2012 నుంచి మెహక్ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నాడు. ఎంతో మంది ఆ రెస్టారెంట్‌లో తినడానికి వస్తుంటారు. అలాగే పార్సిల్స్ కూడా తీసుకెళ్తుంటారు. ఈ క్రమంలో మాంసాహార పదార్థాలు కట్టిన ఒక పార్సిల్‌ పేపర్‌పై హిందూ దేవుళ్ల బొమ్మలు ఉన్నాయి. దీంతో హిందూ జాగరణ్ […]

Advertisement
Update:2022-07-05 07:14 IST

హిందూ దేవుళ్ల బొమ్మలు ఉన్న న్యూస్ పేపర్‌తో మాంసాహార పదార్థాలు పొట్లం కడుతున్నాడనే నెపంతో యూపీలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. యూపీలోని సంభాల్ జిల్లా కేంద్రంలో మహ్మద్ తాలిబ్ అనే వ్యక్తి 2012 నుంచి మెహక్ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నాడు. ఎంతో మంది ఆ రెస్టారెంట్‌లో తినడానికి వస్తుంటారు. అలాగే పార్సిల్స్ కూడా తీసుకెళ్తుంటారు. ఈ క్రమంలో మాంసాహార పదార్థాలు కట్టిన ఒక పార్సిల్‌ పేపర్‌పై హిందూ దేవుళ్ల బొమ్మలు ఉన్నాయి. దీంతో హిందూ జాగరణ్ మంచ్ జిల్లా అధ్యక్షుడు సదరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఇతర మతస్థుల మనోభావాలు గాయపరిచినందుకు ఐపీసీ 295ఏ సెక్షన్ కింద తాలిబ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా, తాలిబ్ గత కొన్నేళ్లుగా దగ్గర్లో ఉన్న పాత న్యూస్ పేపర్లు అమ్మే దుకాణం నుంచి వాటిని కొనుగోలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల భారీగా పాత పేపర్లను పొట్లాలు కట్టేందుకు కొన్నాడు. ఆ పేపర్లలో నవరాత్రి సందర్భంగా హిందూ దేవుళ్ల ఫొటోలు ముద్రించినవి కూడా ఉన్నాయి. అదే ఇప్పుడు అతని అరెస్టుకు దారి తీసింది. ‘మా ఓనర్ తీసుకొచ్చిన న్యూస్ పేపర్లను పొట్లాలు కట్టడానికి ఉపయోగిస్తున్నాను. ప్రతీ పేపర్‌లో ఏముందని మేం చూసుకోం కదా. కనీసం హెడ్‌లైన్స్, బొమ్మలు పరిశీలించేంత తీరిక ఉండదు. ప్రతీ రోజు హడావిడిగా పార్సిల్స్ చేస్తుంటాం’ అని మెహక్ రెస్టారెంట్‌లో పని చేసే ఒక ఉద్యోగి చెప్పాడు. మేం ఏ దేవుళ్లను కించ పరచలేదు.. కేవలం పాత పేపర్లతో ఎప్పటిలాగే పొట్లాలు కట్టామని స్పష్టం చేశాడు.

తాలిబ్ కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయం చెప్తున్నారు. గత పదేళ్లుగా తాలిబ్ ఇదే పద్దతిలో పొట్లాలు కడుతున్నాడు. ఏనాడూ ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. పాత న్యూస్‌పేపర్లు అన్నీ పరిశీలించి ఎవరూ పొట్లాలు కట్టరు కదా అని అంటున్నారు. గతంలో కూడా చాలా మంది ఇలా పొట్లాలు కట్టారు? వాళ్లలో ఎవరినైనా జైలుకు పంపారా అని ప్రశ్నిస్తున్నారు. తాలిబ్ కావాలని ఎవరి మనోభావాలను గాయపర్చలేదని వారు చెప్తున్నారు. మేం ప్రస్తుతం తాలిబ్ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నామని, అంతకు మించి ఏమీ చెప్పలేమ‌ని అన్నారు.

తాలిబ్ స్థానిక హిందీ దినపత్రికను ఉపయోగించి పార్సిల్స్ చేస్తున్నాడని, దానిపై హిందూ దేవుళ్ల బొమ్మలు ఉన్నాయని ఆదివారం కంప్ల‌యింట్ అందినట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ జితేందర్ కుమార్ చెప్పారు. ఇది సున్నితమైన అంశం కావడంతో వెంటనే హోటల్‌కు వెళ్లి అక్కడి న్యూస్ పేపర్లు అన్నింటినీ స్వాధీనం చేసుకున్నామన్నారు. హోటల్ యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశామని వివరించారు.

Tags:    
Advertisement

Similar News