ఏపీలోనూ డబుల్ ఇంజిన్.. మోదీ ఆ సాహసం చేయగలరా..?

తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ఆకాంక్షించారు మోదీ. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన విజయ సంకల్ప సభలో ఆయన బీజేపీ తెలంగాణకు చేసిన మేళ్లను ఏకరువు పెట్టారు. ఈరోజు ఏపీ మోదీ పర్యటన ఉంది. మరి ఏపీ పర్యటనలో ఆయన ఏం మాట్లాడతారు..? డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని చెప్పగలరా..? ఏపీకి అది చేశాం, ఇది చేశాం అని సరిపెడతారా..? లేక ఇక్కడ కూడా స్థానిక ప్రభుత్వాన్ని కాదని, బీజేపీని ఎన్నుకోండని చెప్పగలరా..? మోదీ వ్యూహం […]

Advertisement
Update:2022-07-04 02:00 IST

తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ఆకాంక్షించారు మోదీ. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన విజయ సంకల్ప సభలో ఆయన బీజేపీ తెలంగాణకు చేసిన మేళ్లను ఏకరువు పెట్టారు. ఈరోజు ఏపీ మోదీ పర్యటన ఉంది. మరి ఏపీ పర్యటనలో ఆయన ఏం మాట్లాడతారు..? డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని చెప్పగలరా..? ఏపీకి అది చేశాం, ఇది చేశాం అని సరిపెడతారా..? లేక ఇక్కడ కూడా స్థానిక ప్రభుత్వాన్ని కాదని, బీజేపీని ఎన్నుకోండని చెప్పగలరా..?

మోదీ వ్యూహం అదేనా..?
విజయ సంకల్ప సభలో మిగతా నాయకులంతా కేసీఆర్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు, కానీ మోదీ మాత్రం వ్యూహాత్మక మౌనం పాటించారు. ఎక్కడా విమర్శలు చేయలేదు, టీఆర్ఎస్ ని కించపరిచేలా మాట్లాడలేదు. బహుశా మరుసటి రోజే ఏపీలో పర్యటించాల్సిన సందర్భం ఆయనకు గుర్తొచ్చి ఉంటుందేమో. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీయేతర ప్రభుత్వాలున్నాయి. అక్కడ కేసీఆర్ ని చెడామడా తిట్టేసి, ఇక్కడ జగన్ సర్కారు విషయంలో మౌనంగా ఉంటే బీజేపీ వ్యూహాలపై ప్రతిపక్షాలు విరుచుకుపడతాయి. అక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించి, ఇక్కడ ఏపీ ప్రభుత్వం విషయంలో సైలెంట్ గా ఉంటే.. ఈ లాలూచీ ఏంటనే ప్రశ్నలు వినపడతాయి. అందుకే అక్కడ మోదీ వెనక్కి తగ్గారు, ఇక్కడ తగ్గినా ఎవరూ కామెంట్ చేయలేని పరిస్థితి సృష్టించుకున్నారు.

ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయగలరా..?
వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో తటస్థ వైఖరితో ఉన్నామని చెబుతున్నా.. ఎన్డీఏ సర్కారు తీసుకున్న, తీసుకుంటున్న నిర్ణయాలకు వారి పరోక్ష మద్దతు ఉంటూనే ఉంది. తాజాగా రాష్ట్రపతి ఎన్నికల్లోనూ వారు ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకి మద్దతిస్తామని ప్రకటించారు. ఈ దశలో వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం, వైసీపీ విధానాలను ఎత్తి చూపడం మోదీకి ఎంతమాత్రం గిట్టుబాటు అయ్యే అంశం కాదు. కేంద్రం ప్రకటించిన ర్యాంకుల్ని తప్పు అనే లాజిక్ లేని వ్యాఖ్యలు ఏపీ బీజేపీ నేతలు చేసి ఉండొచ్చు. కానీ ప్రధాని స్థాయిలో మోదీ అంత గుడ్డిగా మాట్లాడితే అభాసుపాలవుతారు. అందులోనూ ఇక్కడ ఏపీ పర్యటనలో సీఎం జగన్ మోదీ పక్కనే ఉంటారని చెబుతున్నారు. ఎయిర్ పోర్ట్ లో ఆయనకు స్వాగతం పలికినప్పటినుంచి, వీడ్కోలు పలికే వరకు.. అధికారిక కార్యక్రమాల్లో మోదీతోపాటే ఉంటారు జగన్. జగన్ ని పక్కనపెట్టుకుని వైసీపీని విమర్శించడం మోదీకి సాధ్యం కాదు, కనీసం ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని కూడా ఆయన చెప్పలేని పరిస్థితి. అందుకే తెలంగాణలో ఆయన వ్యూహాత్మక మౌనం పాటించారు. ఏపీ విషయంలో సేఫ్ గేమ్ ఆడారు.

Tags:    
Advertisement

Similar News