#ModiMustAnswer:మోదీ మస్ట్ ఆన్సర్ … ట్విట్టర్ లో ట్రెండింగ్

హైదరాబాద్ లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోదీ హాజరైన వేళ ‘మోదీ మస్ట్ ఆన్సర్’ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా నిల్చింది. శనివారం నాడు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వచ్చిన సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీకి అనేక ప్రశ్నలు సంధించారు. వీటికి మోదీ సమాధానాలు చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు […]

Advertisement
Update:2022-07-03 06:05 IST

హైదరాబాద్ లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోదీ హాజరైన వేళ ‘మోదీ మస్ట్ ఆన్సర్’ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా నిల్చింది. శనివారం నాడు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వచ్చిన సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీకి అనేక ప్రశ్నలు సంధించారు. వీటికి మోదీ సమాధానాలు చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ ‘మోదీ మస్ట్ ఆన్సర్’ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో మారుమోగి పోయింది. 80 వేలకు పైగా ట్వీట్లతో ఆ హ్యాష్ ట్యాగ్ నెంబర్ వన్ గా నిల్చింది.

వెనక్కి తెస్తానన్ననల్ల ధనం ఏమయ్యింది ? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలేమైనాయి ? ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్ష రూపాయలు ఇంకెప్పుడు వేస్తారు ? ఇలాంటి ప్రశ్నలతో నెటిజనులు మోదీని ఆటాడుకున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మడ‍ం, ప్రశ్నించిన వారిపై ఈడీ, సీబీఐ దాడులు, ప్రభుత్వాలను అప్రజాస్వామికంగా కూలదోసి తాము అధికారంలోకి రావడం తదితర విషయాలపై కూడా నెటిజనులు మోదీకి ప్రశ్నలు సంధించారు.

గతంలో అనేక సార్లు తెలంగాణకు వ్యతిరేకంగా మోదీ మాట్లాడిన వీడియోలు షేర్ చేసి దీనికి మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూడా నెటిజనులు డిమాండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News