ఏపీలో గ్రామ, వార్డు వలంటీర్ల జీతం పెంపు..

ఏపీలోని గ్రామ, వార్డు వలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం నెలకు 5వేల రూపాయలు. అది తమకు ఏమాత్రం సరిపోదని, దాన్ని పెంచాలంటూ గతంలో వలంటీర్లంతా రోడ్డెక్కారు, ఆందోళనకు సిద్ధపడ్డారు. కానీ ప్రభుత్వం మాత్రం వేతనం పెంచలేదు. వలంటీర్ పోస్ట్ అనేది ఉద్యోగం కాదని, కేవలం ప్రజలకు చేసే సేవ అని, అందుకు గౌరవ వేతనంగా 5వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పింది. ఆ తర్వాత వలంటీర్లలో ఉన్న అసంతృప్తి చల్లార్చేందుకు వారికి ప్రతి ఏటా పురస్కారాలు అందిస్తున్నట్టు […]

Advertisement
Update:2022-07-03 06:10 IST

ఏపీలోని గ్రామ, వార్డు వలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం నెలకు 5వేల రూపాయలు. అది తమకు ఏమాత్రం సరిపోదని, దాన్ని పెంచాలంటూ గతంలో వలంటీర్లంతా రోడ్డెక్కారు, ఆందోళనకు సిద్ధపడ్డారు. కానీ ప్రభుత్వం మాత్రం వేతనం పెంచలేదు. వలంటీర్ పోస్ట్ అనేది ఉద్యోగం కాదని, కేవలం ప్రజలకు చేసే సేవ అని, అందుకు గౌరవ వేతనంగా 5వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పింది. ఆ తర్వాత వలంటీర్లలో ఉన్న అసంతృప్తి చల్లార్చేందుకు వారికి ప్రతి ఏటా పురస్కారాలు అందిస్తున్నట్టు ప్రకటించింది. ప్రతి ఏటా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి జిల్లా స్థాయిలో పురస్కారాలు ఇస్తున్నారు. సేవా వజ్రం, సేవా రత్నం.. పేరుతో వలంటీర్లకు నగదు బహుమతులు ఇచ్చారు.

అయితే ఇప్పుడు వలంటీర్లకు నెలకు 200 రూపాయలు అదనంగా చెల్లించేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ పెంపుదల నామమాత్రమే అయినా, ఆ డబ్బుతో వలంటీర్లు ప్రతిరోజూ న్యూస్ పేపర్ వేయించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ఇతరులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుతు ప్రతి వలంటీర్ న్యూస్ పేపర్ చదవాలని, ఎప్పటికప్పుడు పథకాల అమలులో జరుగుతున్న మార్పులను ప్రజలకు వివరించాలని చెబుతున్నారు అధికారులు. ప్రస్తుతం ఏపీలో గ్రామ, వార్డు వలంటీర్లు 2.66 లక్షలమంది ఉన్నారు. అంటే వీరంతా పత్రికలు చదవడంకోసం నెలకు రూ.5.32 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టబోతోందనమాట.

ఉభయకుశలోపరి..
ప్రభుత్వం పేపర్ వేయించుకునేందుకు బిల్లు ఇస్తుంది అంటే.. కచ్చితంగా వలంటీర్లంతా ఏ న్యూస్ పేపర్ వేయించుకుంటారో అందరికీ తెలుసు. సాక్షి సర్క్యులేషన్ పెంచేందుకే వలంటీర్లకు ప్రభుత్వం 200 రూపాయలు చెల్లిస్తోందని, అది తిరిగి సాక్షి యాజమాన్యానికి చేరుతుందని ప్రతిపక్షాలు అప్పుడే విమర్శలు మొదలు పెట్టాయి. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రతి రోజూ సాక్షి పేపర్ వేయిస్తున్నారని, ఇప్పుడు కొత్తగా ప్రతివలంటీర్ కి అదే పేపర్ కొనుగోలు కోసం డబ్బులు వేయడం దారుణం అంటూ విమర్శిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. అయితే జీవోలో ఫలానా న్యూస్ పేపర్ కొనాలని ప్రభుత్వం చెప్పలేదు. దినపత్రికల కొనుగోలు కోసం అని మాత్రమే ప్రస్తావించింది. ఇప్పుడీ వ్యవహారం రాజకీయ చర్చకు తావిచ్చింది.

Tags:    
Advertisement

Similar News