మోడీ రేంజ్ తెలుసా.. మమ్మల్నే రెచ్చగొడతారా? -కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఓ వైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, మరోవైపు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాకతో ఇరు పార్టీల నేతలు పోటీపోటీగా ఫ్లెక్సీలు కట్టుకున్నారు. ర్యాలీలు నిర్వహించుకుంటున్నారు. దీంతో రాజకీయం వేడెక్కింది. కాగా, ఈ పరిస్థితులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ […]

Advertisement
Update:2022-07-02 12:03 IST

టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఓ వైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, మరోవైపు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాకతో ఇరు పార్టీల నేతలు పోటీపోటీగా ఫ్లెక్సీలు కట్టుకున్నారు. ర్యాలీలు నిర్వహించుకుంటున్నారు. దీంతో రాజకీయం వేడెక్కింది.

కాగా, ఈ పరిస్థితులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ హైదరాబాద్‌లో టీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తోంది. ప్రధాని మోడీ వెళ్లే దారిలో కావాలనే టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ప్రధాన మోడీ రేంజ్ ఏమిటో టీఆర్ఎస్ నేతలకు తెలుసా..? ఆయన దేశవ్యాప్తంగా ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుసా.’ అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

తెలంగాణ ప్రభుత్వం రూ. 2.50 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్‌ జేబు నింపుకొన్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని ఆయన విమర్శించారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది.

Tags:    
Advertisement

Similar News