వెల్కం టూ తెలంగాణ… మా తెలంగాణ ఎంత గొప్పదంటే….

హైదరాబాద్ నగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్న వేళ బీజెపి నాయకులకు నిద్రలేకుండా చేస్తున్నది టీఆరెస్. ఒక వైపు నగరమంతా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన పోస్టర్లు, కొన్ని చోట్ల గుర్తు తెలియని వ్యక్తులు మోడీ ఫేల్యూర్స్ తో కూడిన వివరాలతో బై బై మోదీ అంటూ ఫ్లెక్సీలతో నగరంలో హల్ చల్ చేస్తున్నారు. కార్యవర్గ సమావేశాలకు వస్తున్న తమ అగ్రనాయకత్వాన్ని ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు ప్ట్టడానికి, పోస్టర్లు వేయడానికి బీజేపీ నాయకులకు స్థలం దొరకని స్థితి. […]

Advertisement
Update:2022-07-01 08:54 IST
trs posters
  • whatsapp icon

హైదరాబాద్ నగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్న వేళ బీజెపి నాయకులకు నిద్రలేకుండా చేస్తున్నది టీఆరెస్. ఒక వైపు నగరమంతా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన పోస్టర్లు, కొన్ని చోట్ల గుర్తు తెలియని వ్యక్తులు మోడీ ఫేల్యూర్స్ తో కూడిన వివరాలతో బై బై మోదీ అంటూ ఫ్లెక్సీలతో నగరంలో హల్ చల్ చేస్తున్నారు.

కార్యవర్గ సమావేశాలకు వస్తున్న తమ అగ్రనాయకత్వాన్ని ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు ప్ట్టడానికి, పోస్టర్లు వేయడానికి బీజేపీ నాయకులకు స్థలం దొరకని స్థితి. ఈ నేపథ్యంలోనే టీఆరెస్ బీజేపీకి మరో షాక్ ఇచ్చింది.

బీజేపీ నాయకులు వచ్చే తోవ మొత్తం అంటే ఎయిర్ పోర్ట్ నుండి హెచ్ ఐ సీసీ వరకు, హెచ్ ఐ సీసీ నుంచి పంజ గుట్ట వరకు దారి పొడుగునా వెల్కం టూ తెలంగాణ అంటూ స్వాగతం పలుకుతూనే తెలంగాణ ఎంత గొప్పదో చెప్పే పోస్టర్లను అంటించారు.

దేశంలో ఎన్ని రంగాల్లో తెలంగాణ ముందుందో ఆంగ్లంలో వివరిస్తూ వందలాది పోస్టర్లు దర్శనమిచ్చాయి. బీజేపీ నాయకులు కారుల్లో వచ్చేప్పుడు బైటికి ఎటు వైపు చూసినా ఈ పోస్టర్లే దర్శనమిస్తాయి. తెలంగాణ ఎంత అభివృద్ది చెందిందో, ఏ ఏ రంగాల్లో ముందుకు దూసుక పోతుందో వివరిస్తూ ఒక్కో పోస్టర్లో ఒక్కో రంగం గురించి వివరించారు. ఆ వివరాలు వివరంగా మీ కోసం….

పోస్టర్లలో ఉన్న విషయం

‍రైతుబంధు పథకం ద్వారా రైతులకు డైరెక్ట్ గా వారి ఖాతాల్లో డబ్బులు వేసి సహాయం చేయడం, రైతులకు ఇన్సూరెన్స్ స్కీంలు అమలుపర్చడంలోనే భారత దేశంలో మొదటి రాష్ట్రం తెలంగాణ‌

భారత ఆర్థిక వ్యవస్థకు అతి ఎక్కువగా సహాయపడే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ తెలంగాణది

రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ను అ‍ందించే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ‌

తలసరి ఆదాయంలో దేశంలోనే అత్యంత ఎక్కువ వృద్ది రేటు ఉన్న రాష్ట్రం తెలంగాణ‌

ఆరోగ్య పరిరక్షణ లో దేశంలోనే పై స్థాయిలో ఉన్నది తెలంగాణ‌

ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉన్నది తెలంగాణలోనే (కాళేశ్వరం ప్రాజెక్ట్)

దేశంలోని టాప్ 20 మోడల్ గ్రామాల్లో 19 తెలంగాణలోనే ఉన్నాయి.

తలసరి కరెంట్ లభ్యత వృద్ది రేటు భారత్ దేశంలోనే అత్యధికం.

వంద శాతం ఇళ్ళకు మంచినీళ్ళ నల్లా కనెక్షన్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ‌

ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీ రంగంలో దేశంలోనే అత్యధిక వృద్ది రేటు ఉన్న రాష్ట్రం తెలంగాణ‌

దేశంలోనే అత్యధిక సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేసే రాష్ట్రం తెలంగాణ‌

పెరుగుతున్న అటవీ విస్తీర్ణంలో దేశంలోనే టాప్ పొజీషన్ లో ఉన్నది తెలంగాణ‌

వరి ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానం

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఇంక్యూబేట‌ర్ ఉన్న రాష్ట్రం తెలంగాణ‌

దేశంలోనే అత్యంత మత సామరస్యం ఉన్న రాష్ట్రం తెలంగాణ‌

ఈ విధమైన వివరాలతో తెలంగాణ గొప్పతనం గురించి చెప్పినప్పటికీ, ఆ గొప్పతనం సాధించడంలో టీఆరెస్ ప్రభుత్వ పాత్ర గురించి కూడా పరోక్షంగా చెప్పినట్టే. ఈ 8 ఏళ్ళలో టీఆరెస్ సాధించిన విజయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గానీ, ఐటీ శాఖా మంత్రి కేటీర్, హరీష్ రావు లాంటి ఇతర మంత్రులు అనేక సార్లు చెప్పినప్పటికీ , బీజేపీ అగ్రనేతలంతా హైదరాబాద్ వస్తున్న సందర్భంలో అత్యంత వివరంగా తెలంగాణ అభివృద్ది గురించి చెప్తూ పోస్టర్లు వేయడం బీజేపీ క్యాడర్ లో కలకలానికి కారణ మయ్యింది.

Tags:    
Advertisement

Similar News