ప్రధాని కోసం తెలంగాణ రుచులు… కరీంనగర్ యాదమ్మ వంట
ప్రధాని మోదీ కరీంనగర్ యాదమ్మ చేతి వంట తినబోతున్నారు. జూలై 2 నుంచి హైదరాబాద్ లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గసమావేశాల్లో పాల్గొనే అతిథులకు తెలంగాణ వంటలను రుచి చూపించాలని బండి సంజయ్ నిర్ణయించారు. అందుకోసం యాదమ్మను కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు రప్పించారు. తెలంగాణ వంటలు వండాలంటే అందరికీ యాదమ్మనే గుర్తొస్తుందని ప్రతీతి. ఎక్కడ పెద్ద పెద్ద సభలు, సమావేశాలు జరిగినా వంటల కోసం యాదమ్మనే పిలుస్తారు. మం త్రులు కేటీఆర్ తో సహా అనేక […]
ప్రధాని మోదీ కరీంనగర్ యాదమ్మ చేతి వంట తినబోతున్నారు. జూలై 2 నుంచి హైదరాబాద్ లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గసమావేశాల్లో పాల్గొనే అతిథులకు తెలంగాణ వంటలను రుచి చూపించాలని బండి సంజయ్ నిర్ణయించారు. అందుకోసం యాదమ్మను కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు రప్పించారు.
తెలంగాణ వంటలు వండాలంటే అందరికీ యాదమ్మనే గుర్తొస్తుందని ప్రతీతి. ఎక్కడ పెద్ద పెద్ద సభలు, సమావేశాలు జరిగినా వంటల కోసం యాదమ్మనే పిలుస్తారు. మం త్రులు కేటీఆర్ తో సహా అనేక మంది నాయకులు పాల్గొన్న సభల్లో ఈమే వంట చేశారు. పది వేల మందికి కూడా ఏ మాత్రం అలసట లేకుండా వంట చేయడం ఈమెకు వెన్నతో పెట్టిన విద్య
ఈమె వంట గురించి తెలిసే బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ యాదమ్మను కరీంనగర్ నుంచి హైదరాబాద్ రప్పించారు.
”మోదీ సారు తెలం గాణ వంటకాల గురిం చి అడిగారట. సంజయ్ సారు మా యాదమ్మ మంచి వంటకాలు చేస్తదని చెప్పారట. నన్ను బుధవారం పెద్ద హోటల్ కు పిలిపించుకున్నారు.
కూరగాయలతో భోజనం కావాలన్నారు. పులిహోర, పప్పు అన్నం, దద్దోజనం, బగార వంటి ఐదారు రకాల వంటలు, గంగవాయిలి కూర పప్పు , పచ్చి పులుసు, సాంబారు, గుత్తి వంకాయ వం టి కూరగాయలు వండుతాం. సకినాలు, సర్వపిండి, అరిసెలు, భక్షాలు, పాయసం , పప్పు గారెలు వంటివి కూడా తయారు చేస్తాం . పెద్ద హోటల్లో ముఖ్య మైన వాళ్ల కోసం వం ట చేయమంటున్నా రు. మోదీ సారు నేను చేసే వం ట తింటారంటే అం తకంటే ఎక్కు వ ఏముంటుం ది..అదే నాకు భాగ్యం”అని యాదమ్మ అన్నారు.
ప్రస్తుతం ఈ సమావేశాల కోసం వంటలు వండే స్టార్ హోటల్ లో షెఫ్ లు యాదమ్మ దగ్గర తెలంగాణ వంటలు నేర్చుకుంటున్నారు.