ఈ శునకం నేరస్థులకు సింహస్వప్నం

సాధారణంగా పోలీసు అధికారులను, సీబీఐ అధికారులను నేరస్థుల పాలిట సింహస్వప్నంగా అభివర్ణిస్తుంటారు. కానీ తాజాగా ఓ శునకం నేరస్థుల పాలిట సింహస్వప్నంలా మారింది. తప్పు చేయాలనుకొనేవారి వెన్నులో వణుకుపుట్టిస్తోంది కర్ణాటక దావణగెరె జిల్లాలోని ఓ పోలీస్ డాగ్. ఈ శునకం ఇప్పటికే అనేకమంది నేరస్థులను పట్టించింది. దీని పేరు ‘తుంగ 777 చార్లీ’ . పోలీసులకు ఎంతో ఉపయోగపడుతూ.. నేరస్థుల జాడను పట్టిస్తోంది చార్లీ. తాజాగా హొన్నాలి తాలుకాలో జరిగిన హత్యాచార కేసును ఈ జాగిలం ఛేదించింది. […]

Advertisement
Update:2022-06-29 12:30 IST

సాధారణంగా పోలీసు అధికారులను, సీబీఐ అధికారులను నేరస్థుల పాలిట సింహస్వప్నంగా అభివర్ణిస్తుంటారు. కానీ తాజాగా ఓ శునకం నేరస్థుల పాలిట సింహస్వప్నంలా మారింది. తప్పు చేయాలనుకొనేవారి వెన్నులో వణుకుపుట్టిస్తోంది కర్ణాటక దావణగెరె జిల్లాలోని ఓ పోలీస్ డాగ్. ఈ శునకం ఇప్పటికే అనేకమంది నేరస్థులను పట్టించింది. దీని పేరు ‘తుంగ 777 చార్లీ’ . పోలీసులకు ఎంతో ఉపయోగపడుతూ.. నేరస్థుల జాడను పట్టిస్తోంది చార్లీ.

తాజాగా హొన్నాలి తాలుకాలో జరిగిన హత్యాచార కేసును ఈ జాగిలం ఛేదించింది. ఇందుకు సంబంధించిన వివరాలు.. ఈ నెల 22న హొన్నాలి తాలుకాలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై హరీశ్ అనే యువకుడు లైంగికదాడి చేసి.. అనంతరం హత్యచేశాడు. దీంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

చార్లీని సంఘాటనా స్థలానికి తీసుకెళ్లారు. ఘటనా స్థలానికి వచ్చిన శునకం నేరుగా నిందితుడు హరీశ్​ ఇంటికి వెళ్లి ఆగింది. హత్య చేసిన అనంతరం హరీశ్​.. ఆ ఇంట్లోనే స్నానం చేసి బట్టలు మార్చుకున్నాడు. తుంగ.. నిందితుడు స్నానం చేసిన ప్రదేశానికి సైతం వెళ్లింది. ఈ శునకం 2009 నుంచి తమ దగ్గర ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ జాగిలం ఇప్పటివరకు 70 హత్యకేసులు, 30 దొంగతనం కేసులు ఛేదించిందని పోలీసులు చెప్పారు.

Tags:    
Advertisement

Similar News