మహిళలు మగవారిలా బరువు తగ్గలేరా?

సాధారణంగా మహిళలు త్వరగా బరువు పెరిగినట్టుగా కనిపిస్తారు. అలాగే చాలామంది స్త్రీలు బరువు తగ్గేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు కానీ మగవారితో పోల్చి చూస్తే వారు అంత తేలిగ్గా బరువు తగ్గినట్టుగా అనిపించరు. ఇందుకు శాస్త్రీయమైన కారణాలు సైతం ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. అవేంటో చూద్దాం- -ఆడవారిలో టెస్టోస్టెరాన్ అనే హార్మోను తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది మగవారికి సంబంధించినది. ఈ హార్మోను బరువు తగ్గటంలో దోహదం చేస్తుంది. ఇది తక్కువగా ఉండటం వల్లనే స్త్రీలు మగవారితో […]

Advertisement
Update:2022-06-29 14:28 IST

సాధారణంగా మహిళలు త్వరగా బరువు పెరిగినట్టుగా కనిపిస్తారు. అలాగే చాలామంది స్త్రీలు బరువు తగ్గేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు కానీ మగవారితో పోల్చి చూస్తే వారు అంత తేలిగ్గా బరువు తగ్గినట్టుగా అనిపించరు. ఇందుకు శాస్త్రీయమైన కారణాలు సైతం ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు.

అవేంటో చూద్దాం-

-ఆడవారిలో టెస్టోస్టెరాన్ అనే హార్మోను తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది మగవారికి సంబంధించినది. ఈ హార్మోను బరువు తగ్గటంలో దోహదం చేస్తుంది. ఇది తక్కువగా ఉండటం వల్లనే స్త్రీలు మగవారితో పోల్చినప్పుడు వేగంగా బరువు తగ్గలేరు. ఒక అధ్యయనంలో భాగంగా టెస్టోస్టెరాన్ రీప్లేస్ మెంట్ ఇంజక్షన్లు చేయించుకున్న మగవారిని పదకొండేళ్లపాటు పరిశీలించారు. వీరంతా సగటున 20శాతం వరకు బరువు తగ్గినట్టుగా అధ్యయనంలో తేలింది.

-మగవారితో పోల్చినప్పుడు స్త్రీల శరీరకూర్పులో ఎక్కువశాతం కొవ్వు ఉంటుంది. మగవారిలో మెడనుండి పొట్టవరకు… ముఖ్యంగా పొట్టలో కొవ్వు ఎక్కువగా ఉంటే మహిళల్లో కొవ్వు నడుము కింది భాగంలో తొడల్లో ఎక్కువగా చేరుతుంది. మిగిలిన శరీర భాగాలతో పోలిస్తే ఈ భాగాల్లోని కొవ్వు త్వరగా కరగదు. దీనివలన కూడా స్త్రీలు త్వరగా బరువు తగ్గలేరు.

-స్త్రీలలో హార్మోన్ల హెచ్చుతగ్గులు తరచుగా కనబడుతుంటాయి. మన శరీరంలో హార్మోన్లు భిన్నమైన పనులు నిర్వహిస్తుంటాయి. కండరాల ద్రవ్యరాశి కోల్పోకుండా నిర్వహించడం, కొవ్వుని కరిగించడం, ఒత్తిడిని, ఆకలిని ఎదుర్కోవటం… ఇవన్నీ హార్మోన్లు చేసే పనులే. అయితే మహిళల్లో వివిధ కారణాల వలన హార్మోన్ల అసమతౌల్యం ఎక్కువగా ఉంటుంది. దాంతో వారిలో బరువు తగ్గే సామర్ధ్యం తగ్గుతుంది.

-స్త్రీలలో మగవారిలో కంటే కొవ్వు నిల్వలు ఎక్కువగా ఉంటాయి. వారి శరీర ధర్మం కారణంగా అలా ఉంటుంది కానీ… దానిని అదనపు బరువుగా పరిగణించాల్సిన అవసరం లేదని పోషకాహార నిపుణులు అంటున్నారు. మహిళల్లో మగవారిలోకంటే కొంతశాతం కొవ్వు ఎక్కువగా ఉన్నంత మాత్రాన మహిళలు బరువు ఎక్కువగా ఉన్నట్టు కాదని, ఒక స్త్రీ తన ఎత్తుకి వయసుకి తగినట్టుగా సరైన బరువుతో ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఆమె మగవారికంటే ఆరునుండి పదకొండు శాతం ఎక్కువ కొవ్వుని కలిగిఉండే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. కనుక శరీర బరువు విషయంలో, బరువు తగ్గటంలో మహిళలు మగవారితో పోల్చుకోకూడదన్నమాట.

Tags:    
Advertisement

Similar News