విద్యార్థుల కోసం పోరాడితే కేసు పెట్టారు- మోహన్‌బాబు
నటుడు మోహన్‌బాబు ర్యాలీగా కోర్టుకు హాజరవ్వడం చర్చనీయాంశమైంది. 2019 మార్చి 22న అప్పటి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడం లేదంటూ మోహన్‌బాబు విద్యార్థులతో కలిసి మదనపల్లి హైవేపై ధర్నా చేశారు. నాటి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దాంతో మోహన్‌బాబుపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు అయింది. శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగించారన్న అభియోగాన్ని మోపారు. ఈ కేసులోనే తిరుపతి కోర్టుకు మోహన్‌బాబు వచ్చారు. అయితే నేరుగా […]
నటుడు మోహన్‌బాబు ర్యాలీగా కోర్టుకు హాజరవ్వడం చర్చనీయాంశమైంది. 2019 మార్చి 22న అప్పటి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడం లేదంటూ మోహన్‌బాబు విద్యార్థులతో కలిసి మదనపల్లి హైవేపై ధర్నా చేశారు. నాటి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.
ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దాంతో మోహన్‌బాబుపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు అయింది. శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగించారన్న అభియోగాన్ని మోపారు. ఈ కేసులోనే తిరుపతి కోర్టుకు మోహన్‌బాబు వచ్చారు.
అయితే నేరుగా కాకుండా తిరుపతిలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి తన ఇద్దరు కుమారులు, విద్యాసంస్థలకు చెందిన వందల మంది విద్యార్ధులతో పాదయాత్రగా కోర్టుకు వచ్చారు.
అనంతరం తదుపరి విచారణను తిరుపతి కోర్టు సెప్టెంబర్ 20కి వాయిదా వేసింది. అందరి దృష్టిని ఆకర్షించేందుకే ఇలా ర్యాలీగా వచ్చారా అని ప్రశ్నించగా.. తనకు అలాంటి అవసరం లేదని, తనకు ఇప్పటికే ఉండాల్సిన పాపులారిటీ ఉందని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. తాను రియల్ హీరోనని.. విద్యార్థుల కోసం పోరాడితే కేసు పెట్టారని మోహన్ బాబు విమర్శించారు.