డెబిట్ కార్డు రూల్స్ మారుతున్నాయ్! జూలై నుంచే అమలు!

కస్టమర్ల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ కొత్త డెబిట్ కార్డు రూల్స్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్స్ జులై 1 నుంచి అమలు కానున్నాయి. ఈ కొత్త రూల్స్‌లో ఏముందంటే.. మారుతున్న కొత్త రూల్స్ ప్రకారం ఆన్లైన్ వ్యాపారులు కస్టమర్ వివరాలను స్టోర్ చేయకూడదు. దీంతో కస్టమర్లు సురక్షితంగా ఆన్లైన్ లావాదేవీలు చేసుకోవచ్చు. అలాగే కార్డ్ ఆన్ ఫైల్ విధానంలో డెబిట్ కార్డు వివరాలను ఎన్క్రిప్టెడ్ టోకెన్ రూపంలో స్టోర్ చేయబడుతుంది. ఈ టోకెన్ల సాయంతో కస్టమర్లు […]

Advertisement
Update:2022-06-27 03:55 IST

కస్టమర్ల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ కొత్త డెబిట్ కార్డు రూల్స్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్స్ జులై 1 నుంచి అమలు కానున్నాయి. ఈ కొత్త రూల్స్‌లో ఏముందంటే..

మారుతున్న కొత్త రూల్స్ ప్రకారం ఆన్లైన్ వ్యాపారులు కస్టమర్ వివరాలను స్టోర్ చేయకూడదు. దీంతో కస్టమర్లు సురక్షితంగా ఆన్లైన్ లావాదేవీలు చేసుకోవచ్చు. అలాగే కార్డ్ ఆన్ ఫైల్ విధానంలో డెబిట్ కార్డు వివరాలను ఎన్క్రిప్టెడ్ టోకెన్ రూపంలో స్టోర్ చేయబడుతుంది. ఈ టోకెన్ల సాయంతో కస్టమర్లు కార్డు వివరాలను వెల్లడించకుండానే ఆన్లైన్ పేమెంట్లు చేయొచ్చు.

అయితే దీనికోసం ఒరిజినల్ కార్డు డేటా స్థానంలో ఎన్‌క్రిప్టెడ్ డిజిటల్ టోకెన్‌ను తీసుకోవాలి. దీనిని సంబంధించిన గడువును జనవరి 1 నుంచి జూలై 1 కి పొడిగించారు. అయితే కార్టు టోకనైజేషన్ సిస్టమ్ తప్పనిసరి కాదు. కావాలనుకుంటే కస్లమర్లు కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేసి ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు.

ఇకపోతే క్రెడిట్ కార్డు యాక్టివేషన్‌కు సంబంధించిన రూల్స్ కూడా కొన్ని మారాయి. కార్డు జారీ చేసిన 30రోజుల్లో కస్టమర్ యాక్టివేట్ చేసుకోకపోతే, జారీ చేసిన కంపెనీలే కార్డును యాక్టివేట్ చేయడానికి ఒక ఓటీపీని పంపిస్తాయి.

కస్టమర్ ఆ ఓటీపీని చెప్తే కంపెనీలే వాటిని యాక్టివేట్ చేస్తాయి. ఒకవేళ కస్టమర్ రెస్పాండ్ అవ్వకపోతే ఆ అకౌంట్‌ను క్లోజ్ చేసేస్తారు. జూలై 1 నుంచి అమలుకావాల్సిన ఈ రూల్‌ను బ్యాంకుల వినతి మేరకు అక్టోబర్ 1 వరకూ పొడగించారు.

Tags:    
Advertisement

Similar News