ప్రపంచంలోని పురాతన హోటల్ ఇదే.. 52 తరాలుగా ఓకే కుటుంబం ఓనర్లు
హైదరాబాద్ నగరం అనగానే అందరికీ బిర్యానీనే గుర్తుకువస్తుంది. ఇక్కడ రెండు మూడు తరాల నుంచి హోటల్స్‌ను నిర్వహించే వాళ్లను మనం సాధారణంగా చూస్తూనే ఉంటాము. అయితే ఒక కుటుంబం 52 తరాలుగా నిర్వహిస్తున్న హోటల్ మీకు తెలుసా? అవును.. ప్రపంచంలోనే అతి పురాతనమైనదిగా గుర్తింపు పొందిన ఆ హోటల్ జపాన్‌లో ఉంది. జపాన్‌లో మౌంట్ ఫిజీకి సమీపంలో ‘ది నిషియామా ఆన్‌సెన్ క్యూంకన్’ అనే హోటల్ ఉంది. ఇది 705వ సంవత్సరంలో ఫుజివారా మహితో అనే వ్యక్తి […]
హైదరాబాద్ నగరం అనగానే అందరికీ బిర్యానీనే గుర్తుకువస్తుంది. ఇక్కడ రెండు మూడు తరాల నుంచి హోటల్స్‌ను నిర్వహించే వాళ్లను మనం సాధారణంగా చూస్తూనే ఉంటాము. అయితే ఒక కుటుంబం 52 తరాలుగా నిర్వహిస్తున్న హోటల్ మీకు తెలుసా? అవును.. ప్రపంచంలోనే అతి పురాతనమైనదిగా గుర్తింపు పొందిన ఆ హోటల్ జపాన్‌లో ఉంది.
జపాన్‌లో మౌంట్ ఫిజీకి సమీపంలో ‘ది నిషియామా ఆన్‌సెన్ క్యూంకన్’ అనే హోటల్ ఉంది. ఇది 705వ సంవత్సరంలో ఫుజివారా మహితో అనే వ్యక్తి ప్రారంభించాడు. తొలుత చిన్ని హోటల్‌గా ప్రారంభమై.. ఇప్పడు అతిపెద్దగా మారిపోయింది. గత 1300 ఏళ్లుగా అదే కుటుంబానికి చెందిన 52 తరాలు ఈ హోటల్‌ను పర్యవేక్షిస్తున్నాయి. ఈ హోటల్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా చోటు సంపాదించింది. అత్యంత సుదీర్ఘకాలం ఒకే కుటుంబం నిర్వహిస్తున్న హోటల్‌గా దీని పేరు నమోదైంది.
జపాన్‌లోని ఫిజి మౌంటైన్‌కు సందర్శకులు ఎక్కువ. అక్కడికి సమీపంలో ఉన్న నిషియామా అన్‌సెన్ చాలా పాపులర్. హాట్ స్ప్రింగ్స్ (వేడి నీటి బుగ్గలు) చుట్టూ ఈ హొటల్ నిర్మించారు. పక్కనే ఒక నది కూడా ప్రవహిస్తుంది. ఈ వేడి నీటి బుగ్గల నీటితో స్నానం చేసినా, తాగినా రోగాలు మటుమాయం అవుతాయని నమ్ముతారు. అందుకే సామాన్య ప్రజల నుంచి ఎంతో మంది సెలబ్రిటీలు ఈ హోటల్‌ను నిత్యం సందర్శిస్తుంటారు.
హోటల్ రూపురేఖలు మారినా.. హాట్ స్ప్రింగ్స్ ఏ మాత్రం మారలేదు. చాలా స్వచ్ఛంగా ఉండే ఈ నీటిని డైరెక్ట్‌గా తాగడానికి హోటల్ వాళ్లు అనుమతి ఇస్తారు. ఈ హోటల్‌లో హాట్ స్ప్రింగ్స్ నీటితో చేసే స్నానాన్ని మొచితాని నో యూ అని అంటారు. ఇది అక్కడ చాలా పాపులర్. ప్రత్యేకంగా ఈ స్నానం కోసమే సందర్శకులు వస్తుంటారు.
ఈ హోటల్‌లో మొత్తం 37 లగ్జరీ గదులు ఉన్నాయి. అవన్నీ కూడా సాంప్రదాయ జపనీస్ స్టైల్‌లో తీర్చదిద్దబడ్డాయి. అయితే ఇక్కడ ఒక నైట్ స్టే చేయాలంటే దాదాపు రూ. 30వేల వరకు ఖర్చు చేయాల్సిందే.