అది జర్నలిజం కాదు.. దేశద్రోహం – విజయసాయి ఆగ్రహం
వెంకయ్య నాయుడు – రాష్ట్రపతి పదవి.. ఇటీవల ఎక్కువగా టీవీ చర్చల్లో వినిపించిన విషయం ఇది. అందులోనూ ప్రముఖంగా టీడీపీ అనుకూల మీడియాలో మాత్రమే చర్చకు వచ్చిన అంశం. ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడికి రాష్ట్రపతి పదవి ఇస్తారా, ఇవ్వరా..? ఇవ్వకపోతే ఎందుకివ్వరు..? ఆయన క్వాలిఫికేషన్లు ఏంటి..? ఆయనకు అడ్డుపడుతున్నది ఎవరు..? ఇలా రకరకాల ఊహాగానాలను ప్రసారం చేశారు. చివరికి వెంకయ్య నాయుడికి రాష్ట్రపతి పదవి ఇవ్వరనే విషయం తేలిపోయిన తర్వాత మరో రకమైన దుష్ప్రచారం మొదలైంది. […]
వెంకయ్య నాయుడు – రాష్ట్రపతి పదవి.. ఇటీవల ఎక్కువగా టీవీ చర్చల్లో వినిపించిన విషయం ఇది. అందులోనూ ప్రముఖంగా టీడీపీ అనుకూల మీడియాలో మాత్రమే చర్చకు వచ్చిన అంశం. ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడికి రాష్ట్రపతి పదవి ఇస్తారా, ఇవ్వరా..? ఇవ్వకపోతే ఎందుకివ్వరు..? ఆయన క్వాలిఫికేషన్లు ఏంటి..? ఆయనకు అడ్డుపడుతున్నది ఎవరు..? ఇలా రకరకాల ఊహాగానాలను ప్రసారం చేశారు. చివరికి వెంకయ్య నాయుడికి రాష్ట్రపతి పదవి ఇవ్వరనే విషయం తేలిపోయిన తర్వాత మరో రకమైన దుష్ప్రచారం మొదలైంది. ఇలాంటి దుష్ప్రచారం జర్నలిజం కాదని, అది దేశద్రోహంతో సమానం అంటూ విమర్శించారు ఎంపీ విజయసాయి రెడ్డి.
టీవీ ఛానెల్ లో చర్చ సందర్భంగా యాంకర్ మాట్లాడిన మాటల్ని కోట్ చేస్తూ విజయసాయి వరుస ట్వీట్లు చేశారు. వెంకయ్య నాయుడికి రాష్ట్రపతి పదవి ఇవ్వకపోవడంతో ఆయన అభిమానులు ఆవేదన చెందుతున్నారని, ఈ క్రమంలోనే దక్షిణ భారత దేశాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలనే వాదన కూడా బలపడుతోందని లాజిక్ లేకుండా యాంకర్ మాట్లాడారనే విషయాన్ని గుర్తు చేశారు విజయసాయిరెడ్డి. ఇలాంటి జర్నలిస్ట్ లు, ఇలాంటి ఛానళ్లు.. దేశ సమగ్రతకు ముప్పుగా మారతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిపై తక్షణం చర్యలు తీసుకునే అధికారం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఉండేలా తాను పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
టీడీపీవారికేంపని..?
వెంకయ్య నాయుడికి రాష్ట్రపతి పదవి ఇవ్వాలా, ఇవ్వకూడదా అన్నది బీజేపీ అంతర్గత వ్యవహారం. అయితే ఇక్కడ బీజేపీ వాళ్లు కాకుండా.. ఏపీలోని టీడీపీ నేతలు మాత్రమే దీని గురించి మాట్లాడుతున్నారంటే.. దీని భావమేమి తిరుమలేశా..? అంటూ సెటైర్లు వేశారు విజయసాయిరెడ్డి. వెంకయ్య నాయుడికి పదవి రానందుకు దేశం విడిపోతుందనే విధంగా టీవీ చర్చల్లో వ్యాఖ్యలు చేయడం కరోనా కంటే ప్రమాదకరమైన రోగం అన్నారు. దానికి అసలు మందే లేదని. అసలు దాని పేరు కరోనా అని.. ఆ ఖాళీలు మీరే పూరించండి అంటూ సెటైర్లు వేశారు.
ఉత్తర భారతం, దక్షిణ భారతం అంటూ.. దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేలా మాట్లాడటం జర్నలిజం కాదు, దేశ ద్రోహం అంటున్న విజయసాయిరెడ్డి.. ఆ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీలో.. వరుసగా ట్వీట్లు వేశారు. టీడీపీ అనుకూల మీడియాలో వచ్చిన కథనాలను ఎండగట్టారు.