త్వరలోనే రైతు బంధు మంత్రి నిరంజన్ రెడ్డి క్లారిటీ
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పథకం రైతు బంధు. ఈ పథకాన్ని కేసీఆర్ మాసనపుత్రికగా చెబుతుంటారు టీఆర్ఎస్ నేతలు. దేశవ్యాప్తంగా ఈ పథకంపై చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కిసాన్ సమ్మాన్ నిధి కూడా ఈ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొచ్చారనే వాదనలూ ఉన్నాయి. ఈ ఖరీఫ్ కు సంబంధించి ఇంకా రైతు బంధు నగదు రైతుల ఖాతాల్లో పడలేదు. సీజన్ ప్రారంభం కావడంతో పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.వెంటనే రైతు బంధు […]
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పథకం రైతు బంధు. ఈ పథకాన్ని కేసీఆర్ మాసనపుత్రికగా చెబుతుంటారు టీఆర్ఎస్ నేతలు. దేశవ్యాప్తంగా ఈ పథకంపై చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కిసాన్ సమ్మాన్ నిధి కూడా ఈ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొచ్చారనే వాదనలూ ఉన్నాయి.
ఈ ఖరీఫ్ కు సంబంధించి ఇంకా రైతు బంధు నగదు రైతుల ఖాతాల్లో పడలేదు. సీజన్ ప్రారంభం కావడంతో పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.వెంటనే రైతు బంధు నిధులను ప్రభుత్వం విడుదల చేయాలని.. ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.ఇదిలా ఉంటే వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు. త్వరలోనే రైతులకు రైతుబంధు నిధులు జమచేస్తామని ఆయన పేర్కొన్నారు.
బుధవారం ఆయన నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లోని రైతుబంధు సమితి కార్యాలయంలో వ్యవసాయశాఖకు చెందిన కాల్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ ప్రకటన చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కాల్ సెంటర్ ను ప్రారంభించామని చెప్పారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కాల్ సెంటర్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు.