ఏపీకి అప్పులు రాకుండా కుట్రలు.. సీఎం జగన్ తీవ్ర ఆరోపణలు

ఏపీలో అభివృద్ధి పనులు ముందుకు సాగనీయకుండా ప్రతిపక్షాలు రకరకాల కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు సీఎం జగన్. రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు లభించకూడదని, కేంద్రం నుంచి డబ్బులు రాకూడదని, కేసుల ద్వారా అడ్డుకోవాలని, తద్వారా అభివృద్ధి పనులు ఆగిపోవాలని ప్రతిపక్షాలు ఒకే అజెండాతో పనిచేస్తున్నాయని మండిపడ్డారు. అయినా కూడా పట్టువిడవకుండా.. అభివృద్ధి సంకల్పంతో అడుగులు వేస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారాయన. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో అభివృద్ధి పనులకు ఎక్కడా నిధులకు లోటు రాకుండా, చెల్లింపుల సమస్యలేకుండా చూస్తున్నామని వివరించారు. […]

Advertisement
Update:2022-06-22 12:40 IST

ఏపీలో అభివృద్ధి పనులు ముందుకు సాగనీయకుండా ప్రతిపక్షాలు రకరకాల కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు సీఎం జగన్. రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు లభించకూడదని, కేంద్రం నుంచి డబ్బులు రాకూడదని, కేసుల ద్వారా అడ్డుకోవాలని, తద్వారా అభివృద్ధి పనులు ఆగిపోవాలని ప్రతిపక్షాలు ఒకే అజెండాతో పనిచేస్తున్నాయని మండిపడ్డారు. అయినా కూడా పట్టువిడవకుండా.. అభివృద్ధి సంకల్పంతో అడుగులు వేస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారాయన. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో అభివృద్ధి పనులకు ఎక్కడా నిధులకు లోటు రాకుండా, చెల్లింపుల సమస్యలేకుండా చూస్తున్నామని వివరించారు.

రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతు పనుల పురోగతిపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. ప్రతిపక్షాల కుట్రలపై ధ్వజమెత్తారు. పనులు ప్రారంభమై అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లు, ఫ్లైఓవర్లను పూర్తి చేయడానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. పనులు ఎక్కడా పెండింగ్ లో ఉండకూడదని, అత్యంత ప్రాధాన్యత ఇచ్చి త్వరగా పూర్తి చేయాలన్నారు.

విమానాశ్రయాలు, నగరాలను కలిపే రహదారులతోపాటు గన్నవరం నుంచి విజయవాడ.. భోగాపురం నుంచి విశాఖపట్నం వెళ్లే రోడ్లను సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ప్రతి నియోజకవర్గంలో జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్‌ లు ప్రారంభించాలని వాటిలో రోడ్ల నిర్మాణం ఇతర మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. నిర్మాణంలో ఉన్న పనులను, నిధులు లేవన్న సాకుతో పెండింగ్‌ లో పెట్టకూడదని, వాటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలోని రోడ్లపై.. జూలై 15 నాటికి గుంతలు పూడ్చే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జూలై 20న ఫొటో గ్యాలరీలు పెట్టాలని, పంచాయతీ రాజ్‌ రోడ్లకు సంబంధించి ఇప్పుడు చేపడుతున్న పనులతోపాటు.. క్రమం తప్పకుండా వాటి నిర్వహణ పర్యవేక్షించాలని, ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

Tags:    
Advertisement

Similar News