ఫామ్ హౌస్ లో కాంగ్రెస్ నేతల జూదం.. రేవంత్ రెడ్డి అనుచరుడే కీలకం..

హైదరాబాద్ కి కూతవేటు దూరంలో.. మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో 10మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా కాంగ్రెస్ నాయకులని తేల్చారు. అందులో కీలకమైన వ్యక్తి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఎలుగంటి మధుసూదన్ రెడ్డి. ఆయన టీపీసీసీ సెక్రటరీ కూడా. పట్టుబడింది కాంగ్రెస్ నేతలు కావడంతో ఈ వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది. మొయినాబాద్‌ లో ఉన్న సుర‌భి ఎన్‌ క్లేవ్‌ అనే ఫామ్ హౌస్ లోని ఓ […]

Advertisement
Update:2022-06-21 13:09 IST

హైదరాబాద్ కి కూతవేటు దూరంలో.. మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో 10మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా కాంగ్రెస్ నాయకులని తేల్చారు. అందులో కీలకమైన వ్యక్తి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఎలుగంటి మధుసూదన్ రెడ్డి. ఆయన టీపీసీసీ సెక్రటరీ కూడా. పట్టుబడింది కాంగ్రెస్ నేతలు కావడంతో ఈ వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది.

మొయినాబాద్‌ లో ఉన్న సుర‌భి ఎన్‌ క్లేవ్‌ అనే ఫామ్ హౌస్ లోని ఓ గ‌దిలో వీరంతా పేకాట ఆడుతుండగా.. పక్కా సమాచారంతో శంషాబాద్ ఎస్‌ఓటీ టీమ్.. ఆ ఫామ్ హౌస్ పై దాడి చేసింది. తెల్లవారు జామున ఒంటిగంటకు పోలీసులు సురభి ఎన్ క్లేవ్ లోకి ప్రవేశించి పేకాట ఆడుతున్నవారిని చుట్టుముట్టారు. మొత్తం 10మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.14,71,200 న‌గ‌దుతో పాటు 7 సెల్‌ ఫోన్లు, 5 కార్లు స్వాధీనం చేసుకున్నారు. శ్యాంసుంద‌ర్ రెడ్డి, జ‌హంగీర్, పాండు, మ‌హేంద‌ర్ రెడ్డి, సురేష్, ర‌వీంద‌ర్ రెడ్డి, ప్ర‌శాంత్, మ‌ధుసూద‌న్ రెడ్డి, మ‌ల్లేశ్ యాద‌వ్, శ్రీనివాస్ గౌడ్ లుగా వారిని గుర్తించారు.

మధుసూదన్ రెడ్డికి ఇది అలవాటే..
గతంలో కూడా కాంగ్రెస్ నేత మధుసూదన్ రెడ్డి ఇలాగే పేకాట ఆడుతూ పట్టుబడ్డారని, అప్పట్లో ఆయనకు పోలీసులు వార్నింగ్ ఇచ్చి వదిలేశారని చెబుతున్నారు. నిత్యం ఇక్కడ పేకాట ఆడుతుంటారని, రెడ్ హ్యాండెడ్ గా పట్టించేందుకే స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా చెప్పుకునే మధుసూదన్ రెడ్డి.. ఈ పేకాట టీమ్ లో కీలకం కావడంతో ఈ వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది.

Tags:    
Advertisement

Similar News