భిక్షాటన స్థితి నుంచి 55ఏళ్ల వయసులో టీచర్ ఉద్యోగం

ప్రభుత్వాలు, కోర్టుల వద్ద కొన్ని అంశాలు పెండింగ్‌లో పడిపోతే ఇక అవి పరిష్కారం అవడం దైవాదీనమే. 1998 డీఎస్సీ వివాదం కూడా అలాంటిదే. దాదాపు 23 ఏళ్లు పెండింగ్‌లో ఉండిపోయింది. 1998 డిఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులు దశాబ్దాలుగా పోరాటం చేసి చివరకు ఆశలు వదిలేసుకున్నారు. అయితే రెండు రోజుల క్రితం సమస్యను ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి పరిష్కరించారు. 1998 డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేస్తూ, వారికి ఉద్యోగాలు ఇచ్చేలా సీఎం జగన్‌ ఫైల్‌పై సంతకం […]

Advertisement
Update:2022-06-20 03:26 IST

ప్రభుత్వాలు, కోర్టుల వద్ద కొన్ని అంశాలు పెండింగ్‌లో పడిపోతే ఇక అవి పరిష్కారం అవడం దైవాదీనమే. 1998 డీఎస్సీ వివాదం కూడా అలాంటిదే. దాదాపు 23 ఏళ్లు పెండింగ్‌లో ఉండిపోయింది. 1998 డిఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులు దశాబ్దాలుగా పోరాటం చేసి చివరకు ఆశలు వదిలేసుకున్నారు. అయితే రెండు రోజుల క్రితం సమస్యను ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి పరిష్కరించారు. 1998 డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేస్తూ, వారికి ఉద్యోగాలు ఇచ్చేలా సీఎం జగన్‌ ఫైల్‌పై సంతకం చేశారు.

అసాధారణ జాప్యం కారణంగా అప్పట్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఇప్పుడు దాదాపు రిటైర్‌మెంట్ వయసుకు దగ్గరపడ్డారు. సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశతో ఇతర ఉద్యోగాలపైనా దృష్టి పెట్టలేక దశాబ్దాల పాటు ఎదురుచూసి ఎటూ కాకుండా పోయారు కొందరు. అలాంటి వారిలో శ్రీకాకుళం వాసి అల్లక కేదారేశ్వరరావు ఒకరు.

1998లో డీఎస్సీ రాసినా వివాదం కారణంగా ఉద్యోగం రాలేదు. దాంతో కుటుంబ పోషణ కోసం తొలిరోజుల్లో సైకిల్‌పై బట్టలు అమ్మేవాడు. ఆ వ్యాపారం కలిసి రాలేదు. తల్లిదండ్రులు చనిపోయారు. ఇతర బంధువులు పట్టించుకోవడం మానేశారు. దాంతో కేదారేశ్వరరావు మానసికంగా కుంగిపోయారు. పాత సైకిల్‌పై తిరుగుతూ భిక్షాటన చేస్తూ దీనస్థితిలోకి వెళ్లిపోయారు.

అయితే రెండు రోజుల క్రితం సీఎం జగన్‌ ఫైల్‌పై సంతకం చేయడంతో డీఎస్సీ-1998 అభ్యర్థుల జాబితాను అధికారులు విడుదల చేశారు. అందులో కేదారేశ్వరరావు పేరు కూడా ఉంది. ఆయన గతం గురించి తెలిసిన స్థానిక యువకులు.. జాబితాలో కేదారేశ్వరరావు పేరు ఉండడాన్ని గుర్తించి ఆయనకు తెలియజేశారు. ప్రస్తుతం కేదారేశ్వరరావు వయసు 55ఏళ్లు.

రిటైర్‌మెంట్ ఏజ్‌ దగ్గర పడిని సమయంలోనైనా టీచర్ ఉద్యోగం వచ్చినందుకు సంతోషిస్తూనే.. అసాధారణ జాప్యం కారణంగా 23ఏళ్లపాటు తాను కోల్పోయిన జీవితం, ప‌డిన‌ కష్టాలు తలుచుకుని కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags:    
Advertisement

Similar News