అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చివేత.. నర్సీపట్నంలో ఉద్రిక్తత
నర్సీపట్నంలో శనివారం అర్ధరాత్రి నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటి వెనక వైపుఉన్న గోడను మునిసిపల్ అధికారులు ఈ తెల్లవారుజామున జేసీబీతో కూల్చేశారు. పంట కాల్వకు సంబంధించిన ప్రభుత్వం భూమిలోని రెండు సెంట్ల భూమిని ఆక్రమించి గోడ నిర్మించారని పేర్కొంటూ మునిసిపల్ కమిషనర్ నోటీసులు ఇచ్చారు. అయితే, వాటిపై ఈ నెల 2వ తేదీన జారీ చేసినట్టు ఉంది. ఆ నోటీసులను ఇప్పుడు ఇచ్చి ఆ […]
నర్సీపట్నంలో శనివారం అర్ధరాత్రి నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటి వెనక వైపుఉన్న గోడను మునిసిపల్ అధికారులు ఈ తెల్లవారుజామున జేసీబీతో కూల్చేశారు. పంట కాల్వకు సంబంధించిన ప్రభుత్వం భూమిలోని రెండు సెంట్ల భూమిని ఆక్రమించి గోడ నిర్మించారని పేర్కొంటూ మునిసిపల్ కమిషనర్ నోటీసులు ఇచ్చారు. అయితే, వాటిపై ఈ నెల 2వ తేదీన జారీ చేసినట్టు ఉంది. ఆ నోటీసులను ఇప్పుడు ఇచ్చి ఆ వెంటనే గోడను కూల్చడం ఏంటని అయ్యన్న కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. కొంత సేపు నిలిపివేసినట్టే నిలిపి తిరిగి కూల్చివేతలు ప్రారంభించారు.
ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు
అంతకుముందు ఆయన ఇంటిని పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. అయ్యన్న ఇంటికి వెళ్లే దారులను పోలీసులు మూసివేశారు. మీడియాను ఆ పరిసరాల్లోకి అనుమతించలేదు. ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు భారీగా మోహరించిన అనంతరం ఇంటి గోడను కూల్చేశారు. అయన్న పాత్రుడి ఇల్లు కూల్చివేస్తున్నారంటూ ప్రచారం కావడంతో భారీగా ప్రజలు అక్కడికి చేరుకున్నారు. దీంతో భారీ పోలీసుల మోహరింపుతో నర్సీపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ల్యాండ్ పర్మిషన్ ఇచ్చాకే గోడకట్టాం అయ్యన్న కుమారుడు
కాగా, ఇంటి గోడ కూల్చివేతపై అయ్యన్న కుటుంబ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. మునిసిపల్ అధికారుల నుంచి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ప్రహరీ నిర్మించినట్టు అయ్యన్న రెండో కుమారుడు చింతకాయల రాజేష్ తెలిపారు. పోలీసులు ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేశారని ఆరోపించారు. అయితే, అధికారులు మాత్రం గోడను ప్రభుత్వ స్థలంలో నిర్మించినందుకే కూల్చేసినట్టు చెబుతున్నారు. మరోవైపు, అయ్యన్నఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయన కుమారుడు రాజేష్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా పోలీసులు, అయ్యన్న కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం, స్వల్ప తోపులాట కూడా జరిగింది.
ఇది కక్ష సాధింపు చర్యే..
పాత తేదీతో ఉన్న నోటీసులు ఇప్పుడు ఇచ్చి టిడిపినేత అయ్యన్న పాత్రుడి ఇంటిగోడను కూల్చడం కచ్చితంగా కక్ష సాధింపు చర్యేనని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన మినీ మహానాడులో ప్రభుత్వం తీరును వైసిపి నాయకుల మాటలను ఖండిస్తూ ప్రసంగించినందుకే ప్రభుత్వం ఆయనపై కక్ష గట్టిందని మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి వైసిపి నేతలకు చెమటలు పడుతున్నాయనని అందుకే తమ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.