నాలుగేళ్ళ దేశ సేవ తరువాత టీచర్లుగా మారనున్న అగ్నివీరులు
అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో చేరి నాలుగేళ్ల తరువాత మళ్లీ ఇంటిముఖం పట్టనున్న అగ్నివీరులు టీచర్లుగా మారనున్నారు. ‘రిటైర్మెంట్’ తరువాత వీరిని స్కూళ్లలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లుగా నియమించే అవకాశాలున్నాయని కేంద్రం ప్రకటించింది. ఈ పథకాన్ని నిరసిస్తూ దేశంలో అనేక చోట్ల యువత హింసాకాండకు దిగుతున్నారని, కానీ ముందుముందు వారి జీవితాన్ని ఉజ్వలంగా మార్చుకునేందుకు ఎన్నో అవకాశాలున్నాయని కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అంటున్నారు. నాలుగేళ్ళ అనంతరం అగ్నివీరులు సైన్యం నుంచి […]
అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో చేరి నాలుగేళ్ల తరువాత మళ్లీ ఇంటిముఖం పట్టనున్న అగ్నివీరులు టీచర్లుగా మారనున్నారు. ‘రిటైర్మెంట్’ తరువాత వీరిని స్కూళ్లలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లుగా నియమించే అవకాశాలున్నాయని కేంద్రం ప్రకటించింది. ఈ పథకాన్ని నిరసిస్తూ దేశంలో అనేక చోట్ల యువత హింసాకాండకు దిగుతున్నారని, కానీ ముందుముందు వారి జీవితాన్ని ఉజ్వలంగా మార్చుకునేందుకు ఎన్నో అవకాశాలున్నాయని కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అంటున్నారు.
నాలుగేళ్ళ అనంతరం అగ్నివీరులు సైన్యం నుంచి బయటికు వచ్చాక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లుగా మారాలనుకుంటున్న వారికి ప్రత్యేక శిక్షణ ఉంటుందని ఆయన చెప్పారు. వీరికి క్రాష్ కోర్సులవంటివి ఉంటాయని, ఇందుకు దేశ వ్యాప్తంగా స్కూళ్లకు తగిన ఆదేశాలనిస్తామని ఆయన చెప్పారు. ట్రెయినింగ్ అన్నది తప్పనిసరిగా ఉంటుందన్నారు. వివిధ రాష్ట్రాల్లోని పాఠశాలల్లో సుమారు 15 లక్షల పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ దిశగా కూడా తాము ఆలోచిస్తున్నామన్నారు.
యువత హింసాకాండకు పాల్పడడం మంచిది కాదని, వారి కోర్కెల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఇప్పటికే రక్షణ రంగంలో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిందని ఆయన అన్నారు. మీరైతే నాలుగేళ్ళ తరువాత సర్వీసు నుంచి బయటికి రండి.. అప్పుడేం చేయాలో మా శాఖ చూసుకుంటుంది అన్నారాయన.. పైగా మొదటి బ్యాచ్ కి అయిదేళ్ల ఏజ్ రిలాక్జేషన్ కూడా ఇచ్చామన్నారు.
ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు, ఇతర విభాగాల్లో నియామకానికి ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. ఇలాగే అస్సాం, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, కర్ణాటక వంటి పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు.. అగ్నివీరులను ‘కంటికి రెప్పలా కాపాడుతామని’ హామీలు గుప్పించాయి. అయితే ఏమైనప్పటికీ ఈ పథకం కింద ఇప్పుడున్న విధానంలో నియామక ప్రక్రియ చేపట్టడం సరికాదని, ఈ పథకంలో మార్పులు చేయాలని మాజీ సైనికాధికారులు కొందరు సూచిస్తున్నారు.
సైన్యమన్నది ఉద్యోగాల కల్పన గ్యారంటీ స్కీం కానప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన పథకంలో అగ్నివీరుల భవిష్యత్తుకు సంబంధించి ఏదో ఒక గ్యారంటీ ఇవ్వవవలసి ఉందంటున్నారు. అందువల్లే యువత ఈ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, హింసకు దిగుతున్నారని వారు అభిప్రాయపడ్డారు. రెండేళ్ల క్రితమే సైన్యంలో రిక్రూట్మెంట్ చేపట్టాల్సి ఉంది..
కరోనా నెపంతో దాన్ని వాయిదా వేసినప్పటికీ ఆర్మీ అభ్యర్థులకు అన్ని పరీక్షలూ నిర్వహించాక వాటిని రద్దు చేసి. ఇప్పుడు కొత్తగా ఈ పథకాన్ని ప్రకటించడమేమిటన్నది వారి ప్రశ్న.. రక్షణ రంగంలో వీరికి 10 శాతం రిజర్వేషన్లు, మొదటి బ్యాచ్ కి అయిదేళ్ల వయోపరిమితి సడలింపులు వంటి తాయిలాలపై వీరి అభిప్రాయాలేమిటో తేలాల్సి ఉంది. కంటితుడుపు చర్యల వల్ల ప్రయోజనం ఉండదని వారికీ తెలుసు అన్నది విశ్లేషకుల భావన.