సికింద్రాబాద్ లో అగ్నిపథ్ ఆందోళనలు 35 కోట్లకు పైగా నష్టం!
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా.. సైనిక శిక్షణ పొందిన అభ్యర్థులు సృష్టించిన విధ్వంసంలో నష్టపోయిన ఆస్తుల విలువ సుమారు రూ.35 కోట్లకు పైగా ఉంటుందని రైల్వే అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. విధ్వంసం చోటు చేసుకున్న రోజున అప్పటికప్పుడే సుమారు రూ.20 కోట్లకు పైగా నష్టం వాటిల్లి ఉండొచ్చని భావించినా పరిశీలనలో నష్టం దాదాపు 35 కోట్లకు మించవచ్చని అధికారులు తెలిపారు. సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ నష్టం కూడా మరో నాలుగైదు కోట్ల రూపాయల వరకు […]
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా.. సైనిక శిక్షణ పొందిన అభ్యర్థులు సృష్టించిన విధ్వంసంలో నష్టపోయిన ఆస్తుల విలువ సుమారు రూ.35 కోట్లకు పైగా ఉంటుందని రైల్వే అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. విధ్వంసం చోటు చేసుకున్న రోజున అప్పటికప్పుడే సుమారు రూ.20 కోట్లకు పైగా నష్టం వాటిల్లి ఉండొచ్చని భావించినా పరిశీలనలో నష్టం దాదాపు 35 కోట్లకు మించవచ్చని అధికారులు తెలిపారు. సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ నష్టం కూడా మరో నాలుగైదు కోట్ల రూపాయల వరకు పెరగవచ్చని భావిస్తున్నామన్నారు.
తాత్కాలికంగా నష్టం అంచనాలు ఇలా..
విధ్వంసంలో ఎనిమిది రైలింజన్లు దెబ్బతిన్నాయి. నాలుగు రైలుబోగీలు పూర్తిగా దహనమయ్యాయి. మరో 30 ఏసీ బోగీలు, 47 నాన్‌ఎసీ బోగీలు పాక్షికంగా ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. దీంతో పాటు ఎస్కలేటర్లు, ఫ్యాన్‌లు, ఫ్లాట్‌ఫారాలపై ఉన్న దుకాణాలు, టీవీ స్ర్కీన్‌లు, డిజిటల్ బోర్డులు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు.
స్టేషన్‌లోని పార్సిల్ ఆఫీసు కేంద్రం పైనా నిరసనకారులు దాడులు చేశారని చెప్పారు. దీంతో ఆయా ప్రాంతాలకు పంపాల్సిన పార్సిళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యయని, కొన్ని పూర్తిగా కాలిపోయాయని తెలిపారు. కోట్లాది రూపాయల విలువైన పార్సిళ్లు ఆందోళనకారుల విధ్వంసంలో కాలి బూడిదయ్యాయని చెప్పారు.
స్టేషన్‌లో రెండో ఫ్లాట్‌ఫాం నుంచి ఏడో ప్లాట్‌ఫాం వరకూ ఉన్న వస్తు సామగ్రి మొత్తం నిరసనకారుల దాడిలో ధ్వంసమైంది. సిగ్నలింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ పాక్షికం గా దెబ్బతిన్నాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రం సికింద్రాబాద్ స్టేషన్‌కు రోజూ సుమారు 1.5 లక్షల మంది ప్రయాణికులు చేరుకుంటారు.
మరో 1.5లక్షల మంది స్టేషన్ నుంచి బయటకు వస్తారు. ఆందోళనకారులు హింసకు పాల్పడడంతో స్టేషన్ లో సుమారు 250 రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేయడంతో రైల్వేకు తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.