బీజేపీ వ్యతిరేక డేటా టీఆర్‌ఎస్ చేతికి
దేశంలో కాంగ్రెస్ నుంచి అనేక ప్రతి పక్ష పార్టీల వరకు బీజేపీపై పోరాటం విషయం కళ్లు తేలేస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనాయకత్వం ట్విట్లకే పరిమితం అవుతుండగా.. ప్రాంతీయ పార్టీలు బీజేపీకి ఎదురెళ్తే ఏమవుతుందోనన్న భయంతో మౌనంగా ఉన్నాయి. దేశంలోనే వివిధ వర్గాలు, సంస్థలు, మేధావులు కూడా ప్రతిపక్ష పార్టీల నుంచి సరైన మద్దతు లేక మౌనంగా ఉండిపోతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై టీఆర్‌ఎస్ చేస్తున్న పోరు.. బీజేపీ విధానాలపై పోరాటం చేయాలనుకుంటున్న వారిని […]
దేశంలో కాంగ్రెస్ నుంచి అనేక ప్రతి పక్ష పార్టీల వరకు బీజేపీపై పోరాటం విషయం కళ్లు తేలేస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనాయకత్వం ట్విట్లకే పరిమితం అవుతుండగా.. ప్రాంతీయ పార్టీలు బీజేపీకి ఎదురెళ్తే ఏమవుతుందోనన్న భయంతో మౌనంగా ఉన్నాయి. దేశంలోనే వివిధ వర్గాలు, సంస్థలు, మేధావులు కూడా ప్రతిపక్ష పార్టీల నుంచి సరైన మద్దతు లేక మౌనంగా ఉండిపోతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై టీఆర్‌ఎస్ చేస్తున్న పోరు.. బీజేపీ విధానాలపై పోరాటం చేయాలనుకుంటున్న వారిని ఆకర్శిస్తోంది. దేశంలో ఏ రాజకీయ పార్టీ, అందులోనూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ సాగించని తీరున, ధైర్యంగా కేసీఆర్ బీజేపీపై గళమెత్తుతుండడంతో వివిధ వర్గాలు తమ వద్ద ఉన్న బీజేపీ వ్యతిరేక సమాచారాన్ని పంచుకునేందుకు ముందుకొస్తున్నాయి.
కేంద్రంలోని వివిధ శాఖల్లో జరుగుతున్న అవకతవకలను టీఆర్‌ఎస్ పెద్దలకు కీలక వ్యక్తులు అందజేస్తున్నారు. బీజేపీ నేతలకు వ్యతిరేకంగా తాము సేకరించిన వివరాలను, బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని పొందిన వివిధ రకాల మేళ్లు, పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా మోడీ తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రభావం, ఆ నిర్ణయాల వల్ల పెద్దలు పొందిన లబ్ది వంటి కీలకమైన వివరాలను కూడా టీఆర్‌ఎస్ పెద్దల చేతికి అందినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బీజేపీ విధానాలను దగ్గరగా పరిశీలించిన వ్యక్తులు.. ఆ పార్టీ బలహీనతలను, ఆ పార్టీని ఎదుర్కోవడానికి అవసమైన ఐడియాలను కూడా టీఆర్‌ఎస్ పెద్దలతో పంచుకుంటున్నారు. త్వరలోనే ఈ డేటా ఆధారంగా బీజేపీపై టీఆర్‌ఎస్ దాడి మరింత తీవ్రమయ్యే సూచనలు ఉన్నాయి.