ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు… ఆలస్యంగా స్పందించిన అమెరికా

మహ్మద్ ప్రవక్త పై బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వివాదాస్పద‌ వ్యాఖ్యలపై అమెరికా ఆలస్యంగా స్పందించింది. నూపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ విలేకరులతో అన్నారు. బీజేపీ కూడా వారి వ్యాఖ్యలను ఖండించినందుకు సంతోషిస్తున్నామని ఆయన తెలిపారు. “మేము మతమూ, విశ్వాసాల స్వేచ్ఛ గురించి, మానవ హక్కుల విషయంపై సీనియర్ స్థాయిలలో భారత ప్రభుత్వంతో క్రమం తప్పకుండా చర్చలు జరుపుతూ ఉంటాము. మానవ […]

Advertisement
Update:2022-06-17 00:50 IST

మహ్మద్ ప్రవక్త పై బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వివాదాస్పద‌ వ్యాఖ్యలపై అమెరికా ఆలస్యంగా స్పందించింది. నూపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ విలేకరులతో అన్నారు. బీజేపీ కూడా వారి వ్యాఖ్యలను ఖండించినందుకు సంతోషిస్తున్నామని ఆయన తెలిపారు.

“మేము మతమూ, విశ్వాసాల స్వేచ్ఛ గురించి, మానవ హక్కుల విషయంపై సీనియర్ స్థాయిలలో భారత ప్రభుత్వంతో క్రమం తప్పకుండా చర్చలు జరుపుతూ ఉంటాము. మానవ హక్కుల పట్ల గౌరవాన్ని పెంపొందించాలని ప్రతీ సారీ మేము భారతదేశాన్ని కోరుతూ ఉంటాము” అని ఆయన అన్నారు.

కాగా నూపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ లు మే 26న ఇస్లామిక్ ప్రవక్త పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపట్ల అరబ్ దేశాల్లో తీవ్ర నిరసన వ్యక్తమయ్యింది. అనేక దేశాలు ఈ వ్యాఖ్యలను ఖండించాయి.

డ్యామేజ్ కంట్రోల్ కోసం నూపుర్ శర్మ తో పాటు నవీన్ జిందాల్ పై బీజేపీ చర్యలు తీసుకుంది.

కాగా చైనా బలమైన దేశం గా ఎదుగుతూ అమెరికాను సవాల్ చేసే స్థితికి చేరుకున్న నేపథ్యంలో భారత్ తో స్నేహ సంబంధాలకు అమెరికా ప్రాధాన్యమిస్తోంది. అయితే, మోడీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీల వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నద‌నే ఆరోపణలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో యునైటెడ్ స్టేట్స్ ఆచితూచి స్పందిస్తోంది.

Tags:    
Advertisement

Similar News