ఏపీలో సినిమా టికెట్ల అమ్మకాలపై మళ్లీ పీటముడి..

ఏపీలో సినిమా టికెట్ల అమ్మకాలను పూర్తిగా ఆన్ లైన్ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం, థియేటర్ల యాజమాన్యాలతో ఒప్పందం కుదుర్చుకోడానికి సిద్ధమైంది. జులై-2 ఎంఓయూ కుదుర్చుకోడానికి ఆఖరు తేదీ. అయితే ఈ ఎంఓయూలో పొందుపరిచిన నియమనిబంధనలు చూసి ఎగ్జిబిటర్లు షాకవుతున్నారు. ఇది ఏమాత్రం తమకు గిట్టుబాటు కాదని వాపోతున్నారు. ఎంఓయూకి ససేమిరా అంటున్నారు. ఒప్పందం కుదుర్చుకోకపోతే థియేటర్ల లైసెన్స్ లు రద్దు చేస్తామంటూ పరోక్ష హెచ్చరికలు చేస్తున్నా యాజమాన్యాలు మెట్టు దిగడంలేదు. ఎందుకీ ఒప్పందం..? ఏపీలో సినిమా టికెట్ […]

Advertisement
Update:2022-06-17 08:22 IST

ఏపీలో సినిమా టికెట్ల అమ్మకాలను పూర్తిగా ఆన్ లైన్ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం, థియేటర్ల యాజమాన్యాలతో ఒప్పందం కుదుర్చుకోడానికి సిద్ధమైంది. జులై-2 ఎంఓయూ కుదుర్చుకోడానికి ఆఖరు తేదీ. అయితే ఈ ఎంఓయూలో పొందుపరిచిన నియమనిబంధనలు చూసి ఎగ్జిబిటర్లు షాకవుతున్నారు. ఇది ఏమాత్రం తమకు గిట్టుబాటు కాదని వాపోతున్నారు. ఎంఓయూకి ససేమిరా అంటున్నారు. ఒప్పందం కుదుర్చుకోకపోతే థియేటర్ల లైసెన్స్ లు రద్దు చేస్తామంటూ పరోక్ష హెచ్చరికలు చేస్తున్నా యాజమాన్యాలు మెట్టు దిగడంలేదు.

ఎందుకీ ఒప్పందం..?

ఏపీలో సినిమా టికెట్ రేట్ల తగ్గింపు, పెంపు వ్యవహారం ఇటీవల ఏపీలో పెద్ద చర్చకు తావిచ్చింది. ప్రస్తుతం చిన్న సినిమాలకు ఓ రేటు, భారీ బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వ అనుమతితో తొలి రెండు వారాలు మరో రేటు చొప్పున టికెట్లు అమ్ముతున్నారు. అయితే అక్కడ కూడా లెక్కలు తేలడంలేదు. దీంతో ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిన ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థను ఇప్పుడు అమలులోకి తెస్తోంది. దీని ప్రకారం ఏపీలోని ప్రతి థియేటర్లో, ప్రతి సీటుకీ లెక్క ఉంటుంది.

ఏ థియేటర్లో ఎన్ని టికెట్లు బుక్ అయ్యాయనేది ఏరోజుకారోజే ప్రభుత్వానికి తెలుస్తుంది. ఎక్కడా బ్లాక్ టికెట్ల జంజాటం ఉంటదు, తప్పుడు లెక్కలు ఉండవు. దీనికోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం థియేటర్ల యాజమాన్యాలను ఆ కార్పొరేషన్ తో ఒప్పందం చేసుకోవాలని చెప్పింది. టికెట్ రేట్లపై ప్రభుత్వం 2 శాతం సెస్ విధిస్తుంది. ఆన్ లైన్ టికెట్ నిర్వాహకులకు కొంత, మిగతాది సినీ పరిశ్రమ అభివృద్ధికోసం వెచ్చిస్తుంది.

గొడవ ఎందుకు..?

అంతా బాగానే ఉంది కానీ.. ప్రభుత్వం కుదుర్చుకోవాలనుకుంటున్న ఎంఓయూలోనే అసలు పితలాటకం ఉంది. ప్రస్తుతం ఏరోజుకారోజు థియేటర్ల దగ్గర అమ్మే టికెట్ల సొమ్ము యాజమాన్యానికి వెళ్తుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వానికి నేరుగా వెబ్ సైట్ ద్వారా టికెట్ల సొమ్ము వెళ్తుంది. ఆ తర్వాత 2 శాతం సెస్ మినహాయించుకుని దాన్ని యాజమాన్యాలకు తిరిగిస్తామంటోంది ప్రభుత్వం. ఆ సొమ్ము ఎప్పటిలోగా తిరిగిస్తారనే విషయం ఎంఓయూలో లేదు. దీంతో యాజమాన్యాలు కంగారు పడుతున్నాయి. మరోవైపు ఇప్పటికే చాలా థియేటర్లు ఆన్ లైన్ టికెటింగ్ వెబ్ సైట్స్ తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

వాటన్నిటినీ ఇప్పుడు రద్దు చేసుకోవాల్సిందే. అడ్వాన్స్ లు తిరిగివ్వాల్సి ఉంటుంది. దీంతో యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి. పొరపాటున ఆన్ లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత షో రద్దు చేయాల్సిన సందర్భం వస్తే.. టికెట్ సొమ్ము చేతిలో పడకుండా యాజమాన్యాలు ఎలా తిరిగివ్వాలనేది మరో పాయింట్. ఇలా ఈ అనుమానాలన్నిటితో థియేటర్ల యాజమాన్యాలు వెనకడుగు వేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం జులై 2 డెడ్ లైన్ అనడంతో.. మరోసారి సినిమా టికెట్ల రచ్చ మొదలయ్యేలా ఉంది.

Tags:    
Advertisement

Similar News