‘అగ్నిపథ్’ నిరసనలు…సికిందరాబాద్ లో రణరంగం… రెండు బోగీలకు నిప్పు
‘అగ్నిపథ్’ నిరసనలు తెలంగాణను తాకాయి. బీహార్, హర్యాణా లో మూడు రోజులనుండి అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ఇవ్వాళ్ళ ఆ నిరసనలు హైదరాబాద్ ను తాకాయి. సికిందరాబాద్ రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది. వందలాది మంది యువకులు సికిందరాబాద్ స్టేషన్ లోకి దూసుకెళ్ళి రాళ్ళు రువ్వారు. ఆందోళనకారులు ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ కు నిప్పు పెట్టారు. రెండు బోగీలు పూర్తిగా తగలబడిపోయాయి ఒకటో నంబర్ ప్లాట్‌ఫారమ్‌పైకి వెళ్లి అక్కడ ఉన్న […]
‘అగ్నిపథ్’ నిరసనలు తెలంగాణను తాకాయి. బీహార్, హర్యాణా లో మూడు రోజులనుండి అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ఇవ్వాళ్ళ ఆ నిరసనలు హైదరాబాద్ ను తాకాయి. సికిందరాబాద్ రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది.
వందలాది మంది యువకులు సికిందరాబాద్ స్టేషన్ లోకి దూసుకెళ్ళి రాళ్ళు రువ్వారు. ఆందోళనకారులు ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ కు నిప్పు పెట్టారు. రెండు బోగీలు పూర్తిగా తగలబడిపోయాయి ఒకటో నంబర్ ప్లాట్‌ఫారమ్‌పైకి వెళ్లి అక్కడ ఉన్న పార్శిల్ బ్యాగులను తీసుకొచ్చి పట్టాలకు అడ్డంగా విసిరి.. దగ్ధం చేశారు. అలాగే రాళ్లు రువ్వారు.. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.
మొదటి మూడు ఫ్లాట్‌ఫాంలలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ మూడు ఫ్లాట్‌ఫాంలను ధ్వంసం చేశారు. మొత్తానికి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రణరంగంగా మారింది.
అంతకు ముందు స్టేషన్ బైట బస్సులపై రాళ్ళు రువ్వారు. వాళ్ళను అడ్డుకోవడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయడం తో వందలాదిమంది యువకులు ఒక్కసారి రైల్వే స్టేషన్ లోకి పరుగులు తీశారు. అక్కడ భీభత్సం సృష్టించారు. ఇప్పటికీ సికిందరాబాద్ స్టేషన్ లో దాడులు కొనసాగుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. NSUI కార్యకర్తలు పట్టాల మధ్యలో నిప్పుపెట్టారు. వేలాది మందిగా ఉన్న యువకులను పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. పరిస్థితి పోలీసుల చేయి దాటి పోయింది. రైళ్ల అద్దాలను ధ్వంసం చేస్తుంటడంతో ఏమీ చేయలేక పోలీసులు చూస్తూ ఉండిపోయారు. ప్రస్తుతం సికిందరాబాద్ మీదుగా వెళ్ళే అన్ని రైళ్ళను ఎక్కడికక్కడ నిలిపివేశారు.
కాగా కేంద్రం ప్రకటించిన ‘అగ్నిపథ్’ అనే ఆర్మీకి సంబంధించిన పథకంపై దేశవ్యాప్తంగా నిరుద్యోగులు మండిపోతున్నారు. నాలుగేళ్ళ ఉద్యోగం, ఆ తర్వాత రిటైర్ మెంట్ అనే ఈ పథకాన్ని, ఆర్మీ లో చేరేందుకు శిక్షణ పొందుతున్న యువత జీర్ణించుకోలేకపోతోంది. ఆ నేపథ్యంలో అనేక రాష్టాల్లో వేలాదిగా యువత రోడ్ల మీదికి వచ్చి నిరసనలకు దిగుతున్నారు.
.