ఎస్‌ఐ కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి, రాజ్‌భవన్ ముట్టడిలో విధ్వంసం
రాహుల్ గాంధీని రోజుల తరబడి ఈడీ విచారిస్తుండడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన రాజ్‌భవన్ ముట్టడి హైదరాబాద్‌లో ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్ శ్రేణులకు,పోలీసులు మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. కొందరు ఆందోళన కారులు ఖైరతాబాద్ జంక్షన్‌లో బస్సుల అద్దాలను పగులగొట్టారు. బస్సులపైకి ఎక్కి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్లుపై ఒక స్కూటీని తగలబెట్టారు. రాజ్‌భవన్ వైపు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆసమయంలో నేతలకు, పోలీసులకు మధ్య […]
రాహుల్ గాంధీని రోజుల తరబడి ఈడీ విచారిస్తుండడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన రాజ్‌భవన్ ముట్టడి హైదరాబాద్‌లో ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్ శ్రేణులకు,పోలీసులు మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. కొందరు ఆందోళన కారులు ఖైరతాబాద్ జంక్షన్‌లో బస్సుల అద్దాలను పగులగొట్టారు. బస్సులపైకి ఎక్కి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్లుపై ఒక స్కూటీని తగలబెట్టారు.
రాజ్‌భవన్ వైపు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆసమయంలో నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, భట్టి, వీహెచ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని తరలించారు. బస్సులపై రాళ్లు రువ్వడం వెనుక కుట్ర ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
తమ కార్యకర్తలు శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చారని… తమ గుంపులో కొందరు బీజేపీ కార్యకర్తలు చొరబడి వారే విధ్వంసం సృష్టించారని వీహెచ్ ఆరోపించారు. నాలుగైదు గంటల్లో ముగియాల్సిన రాహుల్ గాంధీ విచారణను కక్ష పూరితంగా రోజుల తరబడి ఈడీ చేస్తోందని ఆరోపించారు. రాహుల్ దేశం మొత్తం పర్యటించేందుకు సిద్ధమయ్యారన్న భయంతోనే బీజేపీ ఇలా చేస్తోందన్నారు.
విధ్వంసం సృష్టించింది తమ పార్టీ కార్యకర్తలు కాదని.. టీఆర్‌ఎస్ కార్యకర్తలేనని రేణుకా చౌదరి ఆరోపించారు. ఒకవేళ తమ కార్యకర్తలే ఆ పని చేసి ఉంటే క్షమాపణలు చెబుతామని.. అంతకంటే ముందు విధ్వంసం చేసిన వారు ఎవరన్న దానిపై విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. రోడ్డుపై చాలాసేపు పోలీసులతో రేణుకా చౌదరి వాగ్వాదానికి దిగారు. తనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఐ కాలర్ పట్టుకుని దురుసుగా ప్రవర్తించారామె.