చిరంజీవి బాటలో కమల్.. బ్లడ్ బ్యాంక్ నెలకొల్పిన విశ్వనటుడు..!
మెగాస్టార్ చిరంజీవి నటనలో రాణించడమే కాదు.. సేవలోనూ ముందుంటారన్న విషయం తెలిసిందే. 1998 అక్టోబర్ 2న చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు స్థాపించారు. ఇప్పటికే ఆ కేంద్రాల ద్వారా ఎంతోమందికి సాయం అందుతోంది. ఇప్పుడు చిరంజీవి బాటలో తమిళ స్టార్ హీరో, విశ్వనటుడు కమల్ హాసన్ నడుస్తున్నారు. ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా ఆయన ఒక బ్లడ్ బ్యాంకును స్థాపించారు. దీనికి ‘కమల్స్ బ్లడ్ కమ్యుని’ అనే పేరు పెట్టారు. చెన్నైలోని మక్కల్ నీది […]
మెగాస్టార్ చిరంజీవి నటనలో రాణించడమే కాదు.. సేవలోనూ ముందుంటారన్న విషయం తెలిసిందే. 1998 అక్టోబర్ 2న చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు స్థాపించారు. ఇప్పటికే ఆ కేంద్రాల ద్వారా ఎంతోమందికి సాయం అందుతోంది. ఇప్పుడు చిరంజీవి బాటలో తమిళ స్టార్ హీరో, విశ్వనటుడు కమల్ హాసన్ నడుస్తున్నారు. ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా ఆయన ఒక బ్లడ్ బ్యాంకును స్థాపించారు. దీనికి ‘కమల్స్ బ్లడ్ కమ్యుని’ అనే పేరు పెట్టారు.
చెన్నైలోని మక్కల్ నీది మయ్యం ప్రధాన కార్యాలయంలో పార్టీ నాయకులు, అభిమానులతో కలిసి కమల్ బ్లడ్ బ్యాంకు ప్రారంభించారు. ఈ సందర్భంగా అనేక మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. కమల్ హాసన్ ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా సర్పణి ఇయ్యక్కం పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్న దానం చేయడంతో పాటు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.
అయితే ఆపదలో ఉన్నవారికి రక్తం అందించేందుకోసం బ్లడ్ బ్యాంకు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న కమల్ హాసన్ తాజాగా బ్లడ్ బ్యాంక్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ నేను ఎక్కాల్సిన కొండ చాలా పెద్దది. ప్రస్తుతం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తున్నా. నాలో ఇంకా కసి, పట్టుదల తగ్గలేదు. జైల్లో ఉంటేనే నేను నాయకుడు కాదు..తెరపై కనిపించినా నాయకుడే..’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా కమల్ బ్లడ్ బ్యాంకు ద్వారా రక్త దానం చేయాలనుకుంటున్న దాతలు, రక్తం అవసరమైన వారు బ్లడ్ బ్యాంకును సంప్రదించాలని కమలహాసన్ కోరారు.