పబ్జీ ఆటకు బలయ్యాడా..? సవతి తల్లి చంపేసిందా..?

పబ్జీలో ఓడిపోవడంతో స్నేహితులు అవమానించారని, మచిలీపట్నంలో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. అయితే అది ఆత్మహత్య కాదని, సవతి తల్లి ఆ పిల్లవాడిని చంపేసిందని అసలు తల్లి ఆరోపిస్తోంది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలేం జరిగింది..? మచిలీపట్నంలో గత ఆదివారం16ఏళ్ల బాలుడు ప్రభుకుమార్ ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుకుమార్ పబ్జీ ఆడేవాడని, అందులో ఓడిపోవడంతో స్నేహితులు […]

Advertisement
Update:2022-06-14 09:10 IST

పబ్జీలో ఓడిపోవడంతో స్నేహితులు అవమానించారని, మచిలీపట్నంలో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. అయితే అది ఆత్మహత్య కాదని, సవతి తల్లి ఆ పిల్లవాడిని చంపేసిందని అసలు తల్లి ఆరోపిస్తోంది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అసలేం జరిగింది..?

మచిలీపట్నంలో గత ఆదివారం16ఏళ్ల బాలుడు ప్రభుకుమార్ ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుకుమార్ పబ్జీ ఆడేవాడని, అందులో ఓడిపోవడంతో స్నేహితులు హేళన చేశారని, అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టు పేర్కొన్నారు. కానీ అసలు విషయం అది కాదంటోంది ఆమె తల్లి నరసమ్మ. ప్రస్తుతం ప్రభుకుమార్ పెంపుడు తల్లి వద్ద ఉంటున్నాడని, ఆమే తన కొడుకుని చంపేసిందని ఆరోపిస్తోంది. చిలకలపూడి పోలీస్ స్టేషన్లో నరసమ్మ పెంపుడు తల్లి రాధికపై ఫిర్యాదు చేసింది.

మచిలీపట్నం న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో రాజు కుటుంబం నివాసం ఉంటోంది. రాజు మొదటి భార్య లక్ష్మీ నరసమ్మ. వీరిద్దరికీ ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా.. రాజు భార్య లక్ష్మీనరసమ్మ భర్తను వదిలి విజయవాడలో విడిగా ఉంటోంది. పెద్ద కొడుకు పృథ్వీరాజ్ తల్లితోపాటే విజయవాడలో ఉంటున్నాడు. రెండో కొడుకు ప్రభుకుమార్, ఇద్దరు కుమార్తెలు తండ్రి రాజు వద్ద ఉండేవారు. రాజు రెండో భార్య పేరు రాధిక. భర్త మొదటి భార్య సంతానంతో ఆమెకు గొడవలు ఉన్నాయని అంటున్నారు. వారిని సవతి తల్లి రాధిక సరిగా చూసుకునేది కాదని చెబుతున్నారు నరసమ్మ.

ఈ క్రమంలో ఉన్నట్టుండి తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని కబురు పెట్టారని, తీరా ఇంటికి వచ్చి చూస్తే కొడుకు వంటిపై గాయాలున్నాయని చెబుతున్నారు నరసమ్మ. ప్రభుకుమార్ ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేసి చంపేశారని ఆరోపించారామె. ప‌బ్జీ గేమ్ లో ఓడిపోవడంతో మనస్తాపం చెంది ప్రభు కుమార్ ఉరేసుకున్నాడని ప్రచారంపై ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.తన కుమారుడికి సెల్ ఫోన్ లేదని, అలాంట‌ప్పుడు పబ్జీ ఎలా ఆడతాడని ఆవేద‌న వెలిబుచ్చారు.ఈ ఘ‌ట‌నపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. పోస్ట్ మార్టం నివేదిక ఈ కేసులో కీలకంగా మారబోతోంది.

Tags:    
Advertisement

Similar News