తెలంగాణాకు చరిత్రాత్మక రోజు ఇది ! 24 వేల కోట్ల వ్యయంతో..

తెలంగాణకు ఇది చరిత్రాత్మక రోజంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రాన్ని ఉజ్వల పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చి దిద్దెందుకు మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషికి మరో అద్భుత నిదర్శనం ! ఫార్ట్యూన్ -500 కంపెనీ-రాజేష్ ఎక్స్ పోర్ట్స్ (ఎలెస్ట్) 24 వేల కోట్ల పెట్టుబడితో ఓ అమూల్యమైన డిస్ ప్లే ఫ్యాబ్ ను ఏర్పాటు చేయబోతోంది. అత్యంత అధునాతనమైన ‘అమోల్డ్’ డిస్ ప్లేస్ ను ఉత్పత్తి చేసేందుకు ఈ సంస్థ నడుం కట్టింది. ఇండియాలో ఈ తరహా హై టెక్ […]

Advertisement
Update:2022-06-12 13:09 IST

తెలంగాణకు ఇది చరిత్రాత్మక రోజంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రాన్ని ఉజ్వల పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చి దిద్దెందుకు మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషికి మరో అద్భుత నిదర్శనం ! ఫార్ట్యూన్ -500 కంపెనీ-రాజేష్ ఎక్స్ పోర్ట్స్ (ఎలెస్ట్) 24 వేల కోట్ల పెట్టుబడితో ఓ అమూల్యమైన డిస్ ప్లే ఫ్యాబ్ ను ఏర్పాటు చేయబోతోంది.

అత్యంత అధునాతనమైన ‘అమోల్డ్’ డిస్ ప్లేస్ ను ఉత్పత్తి చేసేందుకు ఈ సంస్థ నడుం కట్టింది. ఇండియాలో ఈ తరహా హై టెక్ సంస్థ ఏర్పాటు కావడం విశేషం. దేశంలో ఈ రంగంలో అతి భారీ పెట్టుబడితో ఈ విధమైన సంస్థ రానుందని కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఇటీవల దావోస్ పర్యటనలో కూడా కేటీఆర్ చొరవతో తెలంగాణకు భారీ కంపెనీలు క్యూ కట్టాయి. పెట్టుబడులు వచ్చాయి, తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. దావోస్ పర్యటన తొలిరోజే.. స్విస్ రే కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఫెర్రింగ్ ఫార్మా సంస్థ తెలంగాణలో తమ రెండో యూనిట్ పెట్టేందుకు దావోస్ లోనే ఒప్పందం కుదుర్చుకుంది. రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది.

జర్మన్ ఆటోమోటివ్ మేజర్ అయిన ZF 3,000 మంది ఉద్యోగులతో హైదరాబాద్‌ లో తన విస్తరణను ప్రారంభించడానికి అంగీకరించింది. హైదరాబాద్‌ లోని జీనోమ్ వ్యాలీలోకి డీఎఫ్‌ఈ ఫార్మా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ “క్లోజర్ టు ది ఫార్ములేటర్” (సీ2ఎఫ్) కూడా చేరేందుకు సిద్ధమైంది. దావోస్ పర్యటనలో.. 4రోజులపాటు 45 కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించిన కేసీఆర్.. మొత్తంగా 4200 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చారు.

ఇక చిన్న మధ్యతరహా పరిశ్రమలు, స్టార్టప్ కంపెనీలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్ గా మారింది. టైర్ -2 సిటీస్ లో బ్రాంచ్ లను ఓపెన్ చేసే ఐటీ కంపెనీలన్నీ తెలంగాణ ని కేంద్రంగా చేసుకుంటున్నాయి. ఇక తెలంగాణ ఐటీ గణాంకాలను పరిశీలిస్తే..

2021-22 ఏడాదికి ఐటీ ఎగుమతుల విలువ 1,83,569 కోట్ల రూపాయలు గా ఉంది. ఏడాదిలో ఐటీ ఎగుమతుల్లో 26.14 శాతం పెరుగుదల ఉంది. రెండో ఐసీటీ పాలసీ(2021-26) ప్రకారం 3లక్షల కోట్ల రూపాయల ఎగుమతులు, 10 లక్షల ఐటీ ఉద్యోగాలను తెలంగాణ టార్గెట్ గా పెట్టుకుంది.

ప్రైవేటు రంగంలో తెలంగాణలో 19 వేల పరిశ్రమలు పెట్టుబడులు పెడుతున్నాయి. మొత్తమ్మీద కేటీఆర్ దూరదృష్టి, ప్రణాళికలతో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. పారిశ్రామిక విప్లవంతో ఉపాధి, ఉద్యోగాల విషయంలో కూడా తెలంగాణ మిగతా రాష్ట్రాలకు అందనంత ఎత్తులో నిలిచింది.

Tags:    
Advertisement

Similar News