ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే – బండి సంజయ్ కొత్త రచ్చ
తెలంగాణ ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు టీఆరెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవ్వాళ్ళ ఆరోపించారు. ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ ఆయన శుక్రవారం జేబీఎస్ లో ప్రయాణీకులతో మాట్లాడారు. బస్సు ఛార్జీలు పెంచి ఆర్టీసీకి ప్రయాణీకులను దూరం చేస్తున్నారని, ఆ విధంగా మెల్లెగా ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తారని సంజయ్ మండిపడ్డారు. బండి సంజయ్ మాటలు వింటే ఈయన ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకమని సంస్థలన్నీ ప్రభుత్వ రంగంలోనే నడవాలని […]
తెలంగాణ ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు టీఆరెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవ్వాళ్ళ ఆరోపించారు. ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ ఆయన శుక్రవారం జేబీఎస్ లో ప్రయాణీకులతో మాట్లాడారు. బస్సు ఛార్జీలు పెంచి ఆర్టీసీకి ప్రయాణీకులను దూరం చేస్తున్నారని, ఆ విధంగా మెల్లెగా ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తారని సంజయ్ మండిపడ్డారు.
బండి సంజయ్ మాటలు వింటే ఈయన ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకమని సంస్థలన్నీ ప్రభుత్వ రంగంలోనే నడవాలని కోరుకుంటున్నారని మనం భావిస్తే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే కేంద్రంలో పరిపాలన సాగిస్తున్న ఆయన పార్టీ ప్రభుత్వం తెలంగాణ సర్కార్ కు ఓ ఆఫర్ ఇచ్చింది. ఆర్టీసీతో సహా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేస్తే 2000 కోట్ల రూపాయల నజరానా ఇస్తామని చెప్పింది. ఈ మేరకు ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కు ఓ లేఖరాసింది కేంద్రం. ఈ విషయాన్ని ఆర్థికశాఖా మంత్రి హరీష్ రావే స్వయంగా, బహిరంగంగా ప్రకటించారు. హరీష్ రావు చెప్పిన దాంట్లో నిజం లేదని చెప్పే దమ్ము బండి సంజయ్ కి లేకపోవచ్చు ఎందుకంటే కేంద్రం అన్ని రాష్ట్రాలకు దాదాపు ఇలాంటి ఆఫర్లనే ఇచ్చింది.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడమే పనిగా పెట్టుకుంది. ఒక్క కొత్త సంస్థను కూడా ఏర్పాటు చేయని మోదీ ప్రభుత్వం 23 ప్రభుత్వరంగ సంస్థలను ప్రవేటు పరం చేసింది. లాభాల్లో కొనసాగుతున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి అనేక సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. పెట్టుబడుల ఉపసంహరణ ఒక ఉద్యమంలాగా చేపట్టిన మోదీ ప్రభుత్వం రాష్ట్రాలను కూడా తమ బాటలోనే నడవాలని సూచిస్తున్నది. పైగా అలా చేస్తే ఆర్థిక సహాయం చేస్తామంటూ ఆశచూపిస్తున్నది.
ఇదీ బండి సంజయ్ పార్టీ చేస్తున్న పని. ఆయనేమో ఆర్టీసీని ప్రైవేటుపరం చేయబోతున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై రచ్చ చేస్తున్నారు. ఇది సంజయ్ కి కొత్త కాదు. మొన్నటికి మొన్న తెలంగాణ లో పండిన వరి ధాన్యాన్ని కొనడానికి కేంద్రం నిరాకరించినప్పుడు. వరి వేయొద్దంటూ రైతులకు సూచించింది రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు కూడా ఇలాగే రచ్చ చేశారు బండి. రైతులందరూ వరే వేయండంటూ రెచ్చగొట్టాడు. కేంద్రంతో తాను కొనిపిస్తానని బడాయిలకు పోయాడు. కానీ చివరికి జరిగిందేమిటి ? కేంద్రం కొనలేదు…బండి సంజయ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు.రాష్ట్రప్రభుత్వం మొత్తం ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేసింది.
ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పోరేట్ సంస్థలకు అడ్డికి పావుషేరుకు తెగనమ్ముతున్న బీజేపీయే తెలంగాణ ఆర్టీసీని అమ్మబోతున్నారంటూ ప్రచారం లంకించుకొవడాన్ని ఏమంటారు ? ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే