దసరా నాటికి జనసేన పొత్తులపై క్లారిటీ.. పవన్ టూర్ ఖరారు..
ఇటీవలే చంద్రబాబు జిల్లాల పర్యటనలు ఖరారు చేశారు. ప్రతి జిల్లాలో నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా, బహిరంగ సభలు, కార్యకర్తల సమావేశాలు, రోడ్ షో లు.. ఇలా ప్లాన్ చేసుకున్నారాయన. ఆ వెంటనే పవన్ కల్యాణ్ కూడా తన పర్యటనలు ఖరారు చేసుకున్నారు. జనసేనాని టూర్ పై ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. దసరాకి పవన్ మహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు తెలిపారు నాదెండ్ల. తిరుపతినుంచి అరంగేట్రం.. వచ్చే ఎన్నికల్లో పవన్ […]
ఇటీవలే చంద్రబాబు జిల్లాల పర్యటనలు ఖరారు చేశారు. ప్రతి జిల్లాలో నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా, బహిరంగ సభలు, కార్యకర్తల సమావేశాలు, రోడ్ షో లు.. ఇలా ప్లాన్ చేసుకున్నారాయన. ఆ వెంటనే పవన్ కల్యాణ్ కూడా తన పర్యటనలు ఖరారు చేసుకున్నారు. జనసేనాని టూర్ పై ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. దసరాకి పవన్ మహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు తెలిపారు నాదెండ్ల.
తిరుపతినుంచి అరంగేట్రం..
వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా ఉంది. దానికి మరింత బలం చేకూర్చేలా.. పవన్ తన పర్యటనను తిరుపతి నుంచి ఖరారు చేసుకున్నారు. అక్టోబర్ 5న తిరుపతితో మొదలయ్యే పర్యటన.. ఆరు నెలలు ఏకధాటిగా సాగుతుందని చెబుతున్నారు జనసేన నేతలు. రాష్ట్రమంతా పవన్ కల్యాణ్ పర్యటిస్తారని, ప్రతి ఉమ్మడి జిల్లాలో బహిరంగ సభ ఉంటుందని అంటున్నారు. అంతే కాదు, 2023లోనే ఎన్నికలు ఉంటాయని కూడా నాదెండ్ల జోస్యం చెబుతున్నారు. పవన్ పర్యటన పూర్తయ్యే నాటికి ఎన్నికలపై క్లారిటీ వస్తుందని, ముందస్తు ఎన్నికలకు జనసైనికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు నాదెండ్ల.
పొత్తులపై క్లారిటీ వచ్చేనా..?
జగన్ ముందుకెళ్తారా, వెనక్కు తగ్గుతారా అనే విషయం పక్కనపెడితే.. అంతకంటే ముందు పవన్ కల్యాణ్ తనకి తాను ఇచ్చుకున్న మూడు ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకోవాలి కదా. కనీసం పొలిటికల్ టూర్ మొదలయ్యే నాటికైనా దీనిపై క్లారిటీ వస్తుందా అనే అనుమానం చాలామందిలో ఉంది. టూర్ మొదలు పెట్టినా కూడా ఇంకా పొత్తులపై వేచి చూసే ధోరణిలో ఉంటే మాత్రం కష్టమే. జిల్లాలో బహిరంగ సభ పెట్టే పవన్, ఓటు వైసీపీకి వేయొద్దు అని చెబితే సరిపోదు… గాజు గ్లాసుకి వేయాలా, లేదా గ్లాసుతోపాటు కమలానికి కూడా వేయాలా.. పోనీ సైకిల్ కి కూడా చోటివ్వాలా అనేది తేల్చి చెప్పాల్సి ఉంటుంది. దాదాపుగా పవన్ పొత్తులపై ఓ క్లారిటీ తెచ్చుకున్న తర్వాతే రాజకీయ పర్యటన మొదలు పెట్టే అవకాశాలున్నాయి.