మైనర్ అత్యాచారం కేసు:వక్ఫ్ బోర్డు చైర్మెన్ రాజీనామాకు టీఆర్‌ఎస్ ఆదేశం ?
జూబ్లీ హిల్స్ అమ్నీషియా పబ్ మైనర్ అత్యాచారం కేసు నేపథ్యంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ ను పదవి నుండి తప్పుకోవాలని టీఆరెస్ అధిష్టానం ఆదేశించినట్టు సమాచారం. వక్ఫ్ బోర్డు చైర్మెన్ మసీవుల్లా మైనర్ కుమారుడు ఈ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. అత్యాచారం కూడా వక్ఫ్ బోర్డు కారులోనే జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయం పై టీఆరెస్ అధినేత సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. మసీవుల్లాతో రాజీనామా చేయించే బాధ్యత ఆయనకు సన్నిహితుడైన హోం మంత్రికి అప్పగించినట్టు […]
జూబ్లీ హిల్స్ అమ్నీషియా పబ్ మైనర్ అత్యాచారం కేసు నేపథ్యంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ ను పదవి నుండి తప్పుకోవాలని టీఆరెస్ అధిష్టానం ఆదేశించినట్టు సమాచారం. వక్ఫ్ బోర్డు చైర్మెన్ మసీవుల్లా మైనర్ కుమారుడు ఈ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. అత్యాచారం కూడా వక్ఫ్ బోర్డు కారులోనే జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయం పై టీఆరెస్ అధినేత సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. మసీవుల్లాతో రాజీనామా చేయించే బాధ్యత ఆయనకు సన్నిహితుడైన హోం మంత్రికి అప్పగించినట్టు సమాచారం.
అయితే ఈ వార్తలను వక్ఫ్ బోర్డు చైర్మెన్ కొట్టి పడేశారు. చైర్మెన్ పదవి నుండి తప్పించడానికి కొన్ని సాంకేతిక అంశాలు అడ్డు వస్తున్నాయనే ప్రచారాన్ని కూడా ఆయన తోసిపుచ్చారు. అధిష్టానం ఆదేశిస్తే తాను వెంటనే రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పారు. అయితే హోం మంత్రితో సహా ఎవ్వరూ తన రాజీనామా ఇప్పటి వరకు కోరలేదని ఆయన స్పష్టం చేశారు.
కాగా, బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఇన్నోవా కారు.. అధికారిక వాహనమా, లేక వక్ఫ్ బోర్డు చైర్మన్ వ్యక్తిగతంగా వినియోగిస్తున్న వాహనమా అనే దానిపై స్పష్టత రాలేదని పోలీసులు అంటున్నారు. ఆ వివరాల కోసం పోలీసులు విచారణ చేస్తున్నారు.