జూబ్లీ హిల్స్ అత్యాచారం కేసు: మైనర్లందరినీ మేజర్లుగా పరిగణించాలి -కేటీఆర్

జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ మైనర్ రేప్ కేసులో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ కేసులో నిందితులైన మైనర్లను మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డ్ ను పోలీసులు కోరారు. ట్రయల్ సమయంలో ఐదుగురు మైనర్లను మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్‌కు హైదరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. చార్జ్‌షీట్ దాఖలు సమయానికి నిందితులంతా మేజర్లు అవుతారని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో విచారించి, శిక్షలు పడేలా చేయాలంటే నిందితులను మేజర్లుగా పరిగణించాలని జువైనల్ బోర్డుకు పోలీసులు లేఖ రాశారు. అయితే […]

Advertisement
Update:2022-06-09 10:16 IST

జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ మైనర్ రేప్ కేసులో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ కేసులో నిందితులైన మైనర్లను మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డ్ ను పోలీసులు కోరారు.
ట్రయల్ సమయంలో ఐదుగురు మైనర్లను మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్‌కు హైదరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

చార్జ్‌షీట్ దాఖలు సమయానికి నిందితులంతా మేజర్లు అవుతారని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో విచారించి, శిక్షలు పడేలా చేయాలంటే నిందితులను మేజర్లుగా పరిగణించాలని జువైనల్ బోర్డుకు పోలీసులు లేఖ రాశారు.

అయితే తుది నిర్ణయం జువైనల్ జస్టిస్ దే. మైనర్ల మానసిక స్థితి, నేరం చేయడనికి వారికి ఉన్న సామర్థ్యం అన్నింటినీ పరిగణలోకి తీసుకుని జువైనల్ జస్టిస్ నిర్ణయాన్ని వెల్లడించనుంది.

కాగా పోలీసుల ప్రయత్నాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఆత్యాచారానికి పాల్పడిన మైనర్లందరినీ మేజర్లుగా పరిగణించాలని ఆయన డిమాండ్ చేశారు. అత్యాచారం వంటి అత్యంత దుర్మార్గమైన నేరాలకు పాల్పడే వారికి మేజర్లకు విధించే శిక్షలనే విధించాలని ఆయన ట్వీట్ చేశారు.

Tags:    
Advertisement

Similar News