అదే జరిగితే.. టీడీపీ ఆఫీస్ మూసేస్తాం -అచ్చెన్న

2024 ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీలో 175 సీట్లు గెలుస్తామని, ఆ దిశగా ఎమ్మెల్యేలు కష్టపడి పనిచేయాలంటూ ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 175 సీట్లు అనేది పెద్ద టార్గెట్ ఏమీ కాదని, ఆయన వైసీపీ శ్రేణులకు ధైర్యం నూరిపోశారు. అయితే వైసీపీ ఆ ఫీట్ సాధిస్తే ఏపీలో టీడీపీ ఆఫీస్ మూసేస్తామంటూ ప్రకటించారు అచ్చెన్నాయుడు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయానికి తాళం వేస్తామని అన్నారు. వైసీపీ 175 సీట్లు గెలవడం అనేది కాస్త పెద్ద […]

Advertisement
Update:2022-06-09 15:04 IST

2024 ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీలో 175 సీట్లు గెలుస్తామని, ఆ దిశగా ఎమ్మెల్యేలు కష్టపడి పనిచేయాలంటూ ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 175 సీట్లు అనేది పెద్ద టార్గెట్ ఏమీ కాదని, ఆయన వైసీపీ శ్రేణులకు ధైర్యం నూరిపోశారు. అయితే వైసీపీ ఆ ఫీట్ సాధిస్తే ఏపీలో టీడీపీ ఆఫీస్ మూసేస్తామంటూ ప్రకటించారు అచ్చెన్నాయుడు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయానికి తాళం వేస్తామని అన్నారు.

వైసీపీ 175 సీట్లు గెలవడం అనేది కాస్త పెద్ద టార్గెట్టే అయినా, టీడీపీ ఆఫీస్ ని ఏకంగా మూసేస్తామని ప్రకటించడం కూడా అంతే పెద్ద సవాల్ అనుకోవాలి. అందులోనూ ఏపీ టీడీపీ అధ్యక్షుడి హోదాలో అచ్చెన్నాయుడు ఈ ప్రకటన చేసే సరికి కాస్త కలకలం రేగింది. పార్టీ ఆఫీస్ కి తాళాలు వేస్తామని ఆయన ప్రకటించడం సవాల్ అనుకోవాలా, లేక ఆవేశంలో నోరు జారారని అనుకోవాలా అర్థం కావడంలేదు. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.

ముందస్తుకి మేం రెడీ..

175 స్థానాల్లో గెలవడం సాధ్యమే అయితే.. వైసీపీ ఇప్పటికిప్పుడే ఎన్నికలకు సిద్ధం కావాలంటూ సవాల్ విసిరారు అచ్చెన్నాయుడు. జగన్ కు అంత నమ్మకమేంటని ప్రశ్నించారు. ఆ నమ్మకం నిజమైతే తక్షణం ప్రభుత్వాన్ని రద్దు చేయాలని, గవర్నర్ ని కలసి ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందని 175 స్థానాల్లో ప్రజలు గెలిపిస్తారని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు.

జూమ్ మీటింగ్ మీరు పెడితే ఏమవుతుందో తెలుసా..?

పదో తరగతి పరీక్షా ఫలితాలపై మంత్రి బొత్స జూమ్ కాన్ఫరెన్స్ పెట్టాలని డిమాండ్ చేశారు అచ్చెన్నాయుడు. తమ జూమ్ మీటింగ్ లోకి వైసీపీ వాళ్లు దొంగల్లా చొరబడ్డారని ఎద్దేవా చేశారు. పిల్లల్ని భయపెట్టి జూమ్ కాన్ఫరెన్సులోకి వైసీపీ వాళ్లు వచ్చారన్నారు. మంత్రి బొత్స జూమ్ కాన్ఫరెన్స్ పెడితే.. విద్యార్థులు, తల్లిదండ్రులు జూమ్‌ లోనే చీపుర్లతో కొడతారని, మొహాన ఉమ్మేస్తారని మండిపడ్డారు. అక్రమంగా తమ జూమ్ కాన్ఫరెన్సులోకి వచ్చిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News