ప్లీజ్ కంగనా….నిజమో అబద్దమో తెలుసుకొని ట్వీట్లు చేయండి !
సోషల్ మీడియాలో ఏది నిజమో ఏది అబద్దమో, ఏది వర్జినల్ వీడియోనో ఏది స్పూఫో తెలుసుకోకుండానే షేర్లు కామెంట్లు చేస్తూ హల్ చల్ చేయడం కొందరికి బాగా అలవాటు. వాళ్ళు పోస్ట్ చేసింది అబద్దమని తెలిస్తే కొందరు డిలీట్ చేస్తే మరికొందరైతే తాము చెప్పిందే రైట్ అని వాదిస్తారు. బాలీవుడ్ తార కంగనా రనౌత్ ఇలాంటి కోవకు చెందుతారు. ఆమె సోషల్ మీడియాలో ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ, రెచ్చగొడుతూ పోస్టులు పెడతారు. తనకు నచ్చనివారిపై వెనకా ముందూ […]
సోషల్ మీడియాలో ఏది నిజమో ఏది అబద్దమో, ఏది వర్జినల్ వీడియోనో ఏది స్పూఫో తెలుసుకోకుండానే షేర్లు కామెంట్లు చేస్తూ హల్ చల్ చేయడం కొందరికి బాగా అలవాటు. వాళ్ళు పోస్ట్ చేసింది అబద్దమని తెలిస్తే కొందరు డిలీట్ చేస్తే మరికొందరైతే తాము చెప్పిందే రైట్ అని వాదిస్తారు.
బాలీవుడ్ తార కంగనా రనౌత్ ఇలాంటి కోవకు చెందుతారు. ఆమె సోషల్ మీడియాలో ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ, రెచ్చగొడుతూ పోస్టులు పెడతారు. తనకు నచ్చనివారిపై వెనకా ముందూ ఆలోచించకుండా కామెంట్లు చేస్తారు. ఈమె ఏమి చేసినా అందులో మోడీ భక్తి కనపడుతూ ఉంటుంది.
ఇక ప్రస్తుతం నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంపైన కూడా కంగన స్పందించారు. నుపుర్ శర్మకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అంత వరకు బాగానే ఉంది. కానీ కతర్ ఎయిర్‌వేస్ సీఈఓ అక్బర్ అల్ బేకర్ పై ఆమె చేసిన కామెంట్లు ఆమెను నవ్వులపాలు చేశాయి. అసలేం జరిగిందంటే….
బీజెపి అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై, ఇస్లాంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాక ఖతర్ తో సహా కొన్ని దేశాలు తీవ్రంగా మండిపడ్డాయి. భారత ఉత్పత్తులు బహిష్కరించండంటూ సోషల్ మీడియాలో ఉద్యమం నిర్వహించారు. దానికి పోటీగా భారత్ లో కొందరు ‘ఖతర్ ఏయిర్ వేస్’ ను బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు మొదలుపెట్టారు. దానిలో భాగంగా వాసుదేవ్ అనే ఓ యువకుడు ఖతర్ ఏయిర్ వేస్ ను బహిష్కరించండి అంటూ పిలుపునిస్తూ ఓ వీడియో షేర్ చేశాడు.
ఆ వీడియోకు జవాబుగా ఖతర్ ఎయిర్‌వేస్ CEO తన బహిష్కరణ కాల్‌ను ఉపసంహరించుకోవాలని వాసుదేవ్‌ను కోరుతున్న స్పూఫ్ వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఎడిట్ చేసిన వీడియోలో అక్బర్ అల్ బేకర్ అల్ జజీరాతో మాట్లాడుతూ, “వాసుదేవ్ మొత్తం 634 రూపాయల 50 పైసల పెట్టుబడితో మా అతిపెద్ద వాటాదారు. మా ఏయిర్ వేస్ ను ఇకపై ఎలా ఆపరేట్ చేయాలో మాకు తెలియడం లేదు. మేము అన్ని విమానాలను నిలిపివేసాము… ఈ బహిష్కరణ పిలుపును వెనక్కి తీసుకోవాలని వాసుదేవ్‌ను అభ్యర్థిస్తున్నాను.”
స్పూఫ్ వీడియోలో ఇంకా ఇలా ఉంది. “ఇది ఒక ప్రత్యేకమైన బహిష్కరణ ఎందుకంటే ఇది bycott. వాసుదేవ్ హబీబీ, మీ TikTok వీడియోలను రూపొందించడానికి మేము మీకు ఒక విమానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. లేదా మేము మీకు రెండు లీటర్ల పెట్రోల్ ఉచితంగా ఇవ్వగలము. . మీరు రైల్వే ట్రాక్ నుండి తిరిగి వచ్చిన తర్వాత, దయచేసి మా ఆఫర్‌ను అంగీకరించండి. దయచేసి బహిష్కరణను వెనక్కి తీసుకోండి.” అని స్పూఫ్ వీడియోలో ఉంది. అయితే ఈ స్పూఫ్ వీడియోను కంగనా అసలైన వీడియోగా అర్దం చేసుకుంది. చెక్ చేసుకోకుండా, వెనకా ముందూ ఆలోచించకుండా ఖతర్ ఎయిర్‌వేస్ CEO మీద విమర్షల వర్షం గుప్పిస్తూ ట్వీట్లు చేసింది.
“ఈ మూర్ఖుడికి పేదవాడిని బెదిరించడానికి సిగ్గు లేదు, ఇది అతని అల్పత్వాన్ని బహిర్గతపరుస్తుంది.. వాసుదేవ్ మీలాంటి ధనవంతుడికి పేదవాడు, అల్పుడు కావచ్చు కానీ భావవ్యక్తీకరణ హక్కు అతనికి ఉంది. ఈ ప్రపంచానికి మించిన ప్రపంచం మరొకటి ఉందని గుర్తుంచుకోండి, ఇక్కడ మనమంతా సమానం.” అని ఆమె ట్వీట్ చేశారు.
ఆమె మరొకట్వీట్ లో, “ఒక పేదవాడిని ఎగతాళి చేసినందుకు ఈ రౌడీని ఉత్సాహపరిచే భారతీయులు కూడా ఉన్నారు. ఈ అధిక జనాభా ఉన్న దేశంలో మీలాంటివాళ్ళంతా పెద్ద భారం అని గుర్తుంచుకోండి.” అని కామెంట్ చేశారు కంగనా.
అయితే ఖతర్ ఎయిర్‌వేస్ CEO ఇంటర్వ్యూ నిజం కాదని అది స్పూఫ్ అని అనేక మంది నెటిజనులు ఆమెకు తెలపడంతో కొంత సేపటికి ఆమె తన ట్వీట్లను తొలగించారు. అయితే ఆ వీడియోను తాను తప్పుగా అర్దం చేసుకున్నానన్న మాట మాత్రం ఆమె చెప్పలేదు.
మనసులో ఓ మాట మెదలగానే వెనకా ముందూ ఆలోచించకుండా అర్జెంట్ గా పోస్ట్ చేయడమనే దురలవాటు ఈ మధ్య బాగా పెరిగిపోయింది. నిజమా అబద్దమా తెలుసుకోకుండా షేర్లు చేయడమనే రోగం కూడా బాగా ముదిరిపోయింది. ప్రతి చిన్న విషయానికి మనోభావాలు దెబ్బతింటున్న ఈ రోజుల్లో సోషల్ మీడియాను జాగ్రత్తగా వాడకపోతే ప్రపంచం మరింత ద్వేషంతో….మరింత హింసాయుత౦గా మారడం ఖాయం.