రైతులకు తోడుంటాం – వైఎస్సార్ యంత్ర సేవా పథకం ప్రారంభోత్సవంలో సీఎం జగన్
రాష్ట్రంలోని రైతులకు ప్రతి దశలోనూ తోడుగా ఉంటామని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. రైతులకు పంట పెట్టుబడి సాయం అందజేయడం దగ్గర నుంచి.. వారు పండించిన పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయడం వరకు ప్రభుత్వం తోడుంటుందని చెప్పారు. గత ప్రభుత్వం రైతులను అన్ని విధాలా మోసం చేసిందని చెప్పారు. మంగళవారం ఆయన గుంటూరు జిల్లాలో చుట్టుగుంట కూడలి వద్ద వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించారు. అనంతరం యంత్రాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 3,800 ట్రాక్టర్లు, […]
రాష్ట్రంలోని రైతులకు ప్రతి దశలోనూ తోడుగా ఉంటామని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. రైతులకు పంట పెట్టుబడి సాయం అందజేయడం దగ్గర నుంచి.. వారు పండించిన పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయడం వరకు ప్రభుత్వం తోడుంటుందని చెప్పారు.
గత ప్రభుత్వం రైతులను అన్ని విధాలా మోసం చేసిందని చెప్పారు. మంగళవారం ఆయన గుంటూరు జిల్లాలో చుట్టుగుంట కూడలి వద్ద వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించారు. అనంతరం యంత్రాలతో ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 3,800 ట్రాక్టర్లు, 320 క్లస్టర్ యంత్రాలు, 320 కంబైన్ హార్వెస్టర్లు పంపిణీ చేశారు. 1140 ఇతర పనిముట్లు అందజేశారు. రైతు గ్రూపు బ్యాంక్ ఖాతాలకు 175 కోట్ల 61 లక్షల రూపాయలను సీఎం విడుదల చేశారు. దాదాపు రూ.691 కోట్ల విలువ గల ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్ల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. ప్రతీ గ్రామంలో పంట విత్తినప్పటినుంచి అమ్మకం వరకు ప్రభుత్వం తోడుగా ఉంటుదని హామీ ఇచ్చారు.
కంబైన్ హార్వెస్టర్లతో ఏడాది పాటు ఉచిత సర్వీసింగ్ ఆపరేషన్ ఉచిత శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. రూ.2016 కోట్లతో ప్రతి ఆర్‌బీకే స్థాయిలో 10,750 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను స్థాపించేందుకు శ్రీకారం చుట్టబోతున్నామని పేర్కొన్నారు.
చంద్రబాబు హయాంలో రైతులకు అరకొర ట్రాక్టర్లు ఇచ్చారన్నారు. గతంలో ట్రాక్టర్ల కొనుగోలులో స్కామ్‌లు జరిగాయని తెలిపారు. నేడు రైతుల ఇష్టం మేరకే ట్రాక్టర్లు కొంటున్నామని సీఎం జగన్ చెప్పారు.