వాళ్లు సంసారమే చేస్తుంటే మధ్యలో పవనేంటి?

పొత్తులపై పవన్‌ కల్యాణ్ ఇచ్చిన మూడు ఆప్షన్లపై టీడీపీ, వైసీపీ, బీజేపీ నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కూడా మేకపోతు గాంభీర్యాన్నే ప్రదర్శిస్తున్నాయి. కాస్త మెత్తగా మాట్లాడితే ఎక్కడ ఎక్కువ సీట్లను జనసేన అడుగుతుందో అన్నట్టుగా టీడీపీ తమ బలాన్ని పెంచి చూపుకుంటోంది. లీడింగ్‌ పార్టీ మాదే- టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీరెడ్డి ”చాలాసార్లు తగ్గానని పవన్ కల్యాణ్ అంటున్నారు. కానీ ఆయన 2019లో ఏమీ తగ్గలేదు. సొంతంగా పోటీ […]

Advertisement
Update:2022-06-05 02:43 IST

పొత్తులపై పవన్‌ కల్యాణ్ ఇచ్చిన మూడు ఆప్షన్లపై టీడీపీ, వైసీపీ, బీజేపీ నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కూడా మేకపోతు గాంభీర్యాన్నే ప్రదర్శిస్తున్నాయి. కాస్త మెత్తగా మాట్లాడితే ఎక్కడ ఎక్కువ సీట్లను జనసేన అడుగుతుందో అన్నట్టుగా టీడీపీ తమ బలాన్ని పెంచి చూపుకుంటోంది.

లీడింగ్‌ పార్టీ మాదే- టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీరెడ్డి
”చాలాసార్లు తగ్గానని పవన్ కల్యాణ్ అంటున్నారు. కానీ ఆయన 2019లో ఏమీ తగ్గలేదు. సొంతంగా పోటీ చేశారు. 137 స్థానాల్లో జనసేన పోటీ చేస్తే 16 చోట్ల డిపాజిట్లు వచ్చాయి, అందులో ఒక స్థానంలో గెలిచారు. ఇదీ ప్రస్తుత నేపథ్యం. 2014లో పవన్ తగ్గారని చెప్పలేం. అప్పుడు కొత్తగా పార్టీ పెట్టారు, నిర్మాణం లేదు కాబట్టి జనసేన పోటీ చేయలేదు. వైసీపీకైతే ఓట్లు పడే పరిస్థితి లేదు.. ప్రతిపక్షాలు గెలవబోతున్నాయన్న ఉద్దేశంతో చంద్రబాబు ఇటీవల వార్ వన్‌ సైడ్ అన్నారు. జనసేన కలిసి వస్తే తప్పకుండా నాలుగు సీట్లు పెరుగుతాయి. ఒకవేళ టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా ఇప్పటికిప్పుడు 120 సీట్లకు తగ్గకుండా గెలుస్తుంది.

టీడీపీకి ఆ బలం ఉంది. మొన్నటి ఎన్నికల్లోనూ టీడీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. 70 లక్షల మంది కార్యకర్తలున్నారు. 2019లో వైసీపీ ఒక్కచాన్స్ అనడం, విక్టిమ్ కార్డు ప్లే చేయడంతో 50 శాతం ఓట్లు వచ్చాయే గానీ.. ఆ పార్టీకి అప్పుడు ఇప్పుడు కేడర్‌ అన్నదే లేదు. టీడీపీకి బూతు స్థాయి నుంచి కేడర్‌ ఉంది.. నిరంతరం పోరాడుతున్నాం. అందుకే రోజురోజుకు పుంజుకుంటున్నాం. పొత్తులపై మాట్లాడవద్దని మాకు పార్టీ నాయకత్వం చెప్పింది. టీడీపీ బలమైతే ఇప్పుడు ఎన్నికలు జరిగినా ఒంటరిగా 120కిపైగా సీట్లు గెలుస్తాం. జగన్‌ ఢిల్లీలో అమిత్ షాను కలిసినప్పుడు కూడా ముందస్తు ఎన్నికల ప్రతిపాదన చేశారు. అమిత్ షా దగ్గరి వ్యక్తులే ఈ విషయాన్ని ఒక వైసీపీ ఎంపీకి చెప్పగా.. ఆ ఎంపీనే మా పార్టీ వారితో పంచుకున్నారు. ఆర్థిక విధానాల కారణంగా వెనక్కు రాలేన్నంత స్థాయిలోకి వైసీపీ జారిపోయింది. ”

టీడీపీకి అంత లేదు, రుణం తీర్చుకునే టైం ఇది- జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్
”2014లో మేం తగ్గాం. ఇప్పుడు కూడా మేమే తగ్గాలా?. ఈసారి మీరు తగ్గిండి అని టీడీపీకి పవన్‌ చెబుతున్నారు. ప్రస్తుతానికి బీజేపీతో ఉన్నాం. టీడీపీ తగ్గి వస్తే ఆ పార్టీని కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కలుపుకుని పోతాం. పవనే సీఎం కావాలన్నది జనసేన శ్రేణుల అభిమతం. ఇద్దరి పాలనా చూశారు. ఇప్పుడు పవన్ పాలన చూడాలని ప్రజలు అనుకుంటున్నారు.

విపత్కర పరిస్థితుల్లో 2014లో నిస్వార్థంగా టీడీపీకి మద్దతు ఇచ్చాం. ఇప్పుడా రుణం తీర్చుకోవాల్సిన సమయం టీడీపీకి వచ్చింది. మహానాడు తర్వాత టీడీపీ జోష్ ఏమీ పెరగలేదు. ప్రజల్లో ఎలా ఉందో వారికీ తెలుసు. కాకపోతే కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు అలా మాట్లాడుతున్నారు. జనసేనతో కలిసి రావడమా లేదా అన్న దానిపై బంతి ఇప్పుడు టీడీపీ కోర్టులోనే ఉంది.”

వాళ్లు సంసారమే చేస్తుంటే మధ్యలో ఈ మాటలేంటి?- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

”పవన్ కల్యాణ్ తెలివైన వారో, అతి తెలివి ఉన్న వారో అర్థం కావడం లేదు. పెళ్లి చేసుకోకపోయినా బీజేపీ- వైసీపీ కలిసి సంసారం చేస్తున్నాయి. అలాంటప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా బీజేపీ రోడ్‌ మ్యాప్‌ ఇస్తుందని పవన్ ఎలా భావిస్తున్నారు. పార్లమెంట్‌లో బిల్లులపైనా బీజేపీ ఒక చేయి ఎత్తమంటే వైసీపీ ఎంపీల చేత జగన్‌ రెండు చేతులు ఎత్తించి మద్దతు ఇస్తున్నారు. బీజేపీ కూడా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతున్నా.. కొత్తగా అప్పులు తెచ్చుకునేందుకు జగన్‌కు అనుమతి ఇస్తోంది. పక్కన ప్రశ్నించిన తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం అప్పులు తెచ్చుకునే అవకాశం కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తోంది.

అసలు వైసీపీతో ఉంటారా లేక ఏపీలోని ప్రతిపక్షాలతో ఉంటారా అన్న దానిపై బీజేపీ పెద్దల చేత తొలుత పవన్ కల్యాణ్ స్పష్టత ఇప్పించాలి. అసలు ఎవరు ఎవరితో పోరాటం చేస్తున్నారో అర్థం కావడం లేదు. భవిష్యత్తులో పవన్‌ బీజేపీ నుంచి దూరం అవడం ఖాయం. ఏపీలోసెక్యూలర్ పార్టీలన్నీ ఏకం కావాలి. వైసీపీతో చెట్టాపట్టాలేసుకుని ఎందుకు తిరుగుతున్నారో బీజేపీ పెద్దలను పవన్ కల్యాణ్ నిలదీయాలి.”

కన్ను కొట్టినా, కొట్టకపోయినా వెళ్లేలా ఉన్నారు- వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

” పవన్‌ ఇచ్చింది పొత్తులపై ఆప్షన్లు కాదు. ప్యాకేజీలపై ఆప్షన్లు. ప్రతిపక్షాలు ఎంత బలహీనంగా ఉన్నాయో పవన్‌ వ్యాఖ్యలను బట్టే అర్థమవుతోంది. ఒంటరిగా పోటీ చేసే దమ్ము ప్రతిపక్షాలకు లేదని తేలిపోయింది. చంద్రబాబు కన్ను కొట్టి పిలిచినా, చప్పట్టు కొట్టి పిలిచినా, చివరకు పిలవకపోయినా వెళ్లే స్థాయికి పవన్ కల్యాణ్ దిగజారిపోయారు.

Tags:    
Advertisement

Similar News