వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు.. వార్నింగ్ ఇచ్చిన అధిష్టానం.!

ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ఊహాగానాల నేపథ్యంలో అప్పుడే రాష్ట్రంలో ఎలక్షన్ మూడ్ మొదలైంది. ఈ సారి మనం 175 సీట్లు గెలవలేమా? అని సీఎం జగన్ తన పార్టీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మంత్రి వర్గంలో మార్పులు చేసి.. కీలక నేతలకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అయితే కొన్ని జిల్లాల్లో పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న […]

Advertisement
Update:2022-06-04 12:12 IST

ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ఊహాగానాల నేపథ్యంలో అప్పుడే రాష్ట్రంలో ఎలక్షన్ మూడ్ మొదలైంది. ఈ సారి మనం 175 సీట్లు గెలవలేమా? అని సీఎం జగన్ తన పార్టీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మంత్రి వర్గంలో మార్పులు చేసి.. కీలక నేతలకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అయితే కొన్ని జిల్లాల్లో పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలాంటి తగాదాలు పార్టీకి చేటు చేస్తాయని భావించి వారిని నేరుగా మంగళగిరి పిలిపించి మరీ మాట్లాడారు.

వైసీపీ అధినేత, సీఎం జగన్ వరకు ఈ కుమ్ములాటల వ్యవహారం వెళ్లడంతో.. ఆయనే స్వయంగా వారిని పిలిపించి మాట్లాడాలని ముఖ్య నేతలకు చెప్పారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కీలకమైన నియోజవర్గంలో ఈ గొడవలు ఎక్కువగా ఉండటం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. అందుకే ముందుగా ఆ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలను పిలిపించి గట్టిగానే క్లాస్ పీకినట్లు తెలుస్తున్నది. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి సెగ్మెంట్‌కు చెందిన నేతల మధ్య సఖ్యత సరిగా లేనట్లు గుర్తించి వారికి గట్టి వార్నింగ్ ఇచ్చింది. రాష్ట్రమంతటా జగన్ ప్రభంజనం వీచినా.. టెక్కలిలో మాత్రం టీడీపీ గెలవడానికి అప్పుడు కూడా వైసీపీ నేతల గొడవలే కారణమని గుర్తించింది.

టెక్కలి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్, శ్రీకాకుళం పార్లమెంట్ వైసీపీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి ఎవరికి వారేగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. వాళ్లు ఆ నియోజకవర్గంలో మూడు గ్రూపులుగా జట్టు కట్టి కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారని.. వారి తీరుతో క్షేత్రస్థాయి నాయకులు ఇబ్బందులు పడుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. టీడీపీ బలంగా ఉన్న చోట మరింత ఉధృతంగా పని చేయాల్సింది పోయి.. ఈ ముగ్గురూ పార్టీకి చేటు చేసేలా వ్యవహరించడంపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ముగ్గురినీ పార్టీ కార్యాలయంలో కూర్చోబెట్టి గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. టెక్కలిలో ఎవరు ఏం పని చేయాలనే దానిపై విభజన చేసి ఇచ్చారని.. ఎవరి డైరెక్షన్‌లో పని చేయాలనే దానిపై కూడా స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తున్నది. గతంలోనే పార్టీ అధినేత వైఎస్ జగన్ చెప్పినట్లు.. మంత్రులైనా సరే పార్టీ కార్యక్రమాల్లో అధ్యక్షుల మాటలే వినాలని ఆదేశించారు. ఆ మేరకు ఈ ముగ్గురూ టెక్కలిలో ఆ నియోజకవర్గ అధ్యక్షుడి సూచన మేరకే పని చేయాలని చెప్పినట్లు తెలుస్తున్నది. అంతే కాకుండా మరో సారి గొడవలు పడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది.

రాబోయే రోజుల్లో ఇతర నియోజకవర్గాల్లో.. ముఖ్యంగా టీడీపీ గెలిచిన సీట్లలో వైసీపీ నేతల మధ్య సఖ్యత లేకపోతే కేంద్ర కార్యాలయానికి పిలిచి మాట్లాడాలని భావిస్తున్నారు. మరి అధిష్టానం వార్నింగుల తర్వాతైనా సదరు నాయకుల్లో మార్పు వస్తుందో రాదో అని కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News