నేరం చేయండి.. గౌరవం పొందండి
చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ రాజకీయంగా పార్టీని నిలబెట్టేందుకు వేస్తున్న కొన్ని ఎత్తులు మాత్రం ఇబ్బందికరంగానే ఉన్నాయి. పరోక్షంగా వారిద్దరూ శ్రేణుల్లో నేరస్వభావాన్ని పెంచేస్తున్నారు. మరి ముఖ్యంగా అమాయక యువత వీరి లక్ష్యాలకు చిక్కుకుంటోంది. రాష్ట్రంలో ఎదో అలజడి నడుస్తోందన్న భావన కలిగించేందుకు.. రెచ్చిపోవాలని టీడీపీ శ్రేణులు ఆ పార్టీ నాయకత్వం చాలా కాలంగా సంకేతాలు ఇస్తూ వస్తోంది. దాంతో అధికార ప్రతినిధుల నుంచి ఐ- టీడీపీ సభ్యుల వరకు అనుచిత మాటలు, పోస్టులకు ఏమాత్రం […]
చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ రాజకీయంగా పార్టీని నిలబెట్టేందుకు వేస్తున్న కొన్ని ఎత్తులు మాత్రం ఇబ్బందికరంగానే ఉన్నాయి. పరోక్షంగా వారిద్దరూ శ్రేణుల్లో నేరస్వభావాన్ని పెంచేస్తున్నారు. మరి ముఖ్యంగా అమాయక యువత వీరి లక్ష్యాలకు చిక్కుకుంటోంది. రాష్ట్రంలో ఎదో అలజడి నడుస్తోందన్న భావన కలిగించేందుకు.. రెచ్చిపోవాలని టీడీపీ శ్రేణులు ఆ పార్టీ నాయకత్వం చాలా కాలంగా సంకేతాలు ఇస్తూ వస్తోంది. దాంతో అధికార ప్రతినిధుల నుంచి ఐ- టీడీపీ సభ్యుల వరకు అనుచిత మాటలు, పోస్టులకు ఏమాత్రం వెనుకాడడం లేదు. ఇలాంటి పనుల వల్ల కేసులు, ఇతర ఇబ్బందులు వస్తాయని తెలిసినా వారు అలా రెచ్చిపోవడానికి ప్రధాన కారణంగా చంద్రబాబు, నారా లోకేష్ తీరే.
కేసులు పెట్టినా ఏమీ కాదు… నాపైనా కేసులున్నాయి.. రెచ్చిపోండి అంటూ కొద్దిరోజుల క్రితం లోకేష్ బహిరంగంగానే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పైగా 14 కేసులు ఉన్న కార్యకర్తలకు మాత్రమే తనను కలిసే అవకాశం ఇస్తానని ప్రకటించారు. ఇక చంద్రబాబు కూడా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ ఎవరైనా అరెస్ట్ అయితే వెంటనే వారికి మద్దతుగా మాట్లాడుతున్నారు. అచ్చెన్నాయుడు ప్రధాన అనుచరుడు వెంకటేశ్ కూడా ఇలాగే ఏపీలో పథకాలు ఆపేస్తున్నారంటూ తప్పుడు పోస్టు పెట్టగా అరెస్ట్ చేశారు పోలీసులు. అతడిని చంద్రబాబు ప్రత్యేకంగా పిలిపించుకుని భుజం మీద చేయి వేసి ఫోటోలు దిగి.. నేనున్న రెచ్చిపో అని సంకేతాలు ఇచ్చారు.
అలా భుజం మీద చేయి ప్రోత్సహించడమే ప్రమాదం. తప్పుడు పోస్టు పెట్టానని వెంకటేశ్ ఒప్పుకున్న తర్వాత కూడా అతడిని అరెస్ట్ చేయడం అన్యాయం అంటూ చంద్రబాబు లాంటి నేతలు మాట్లాడడం సమాజానికి శ్రేయస్కరం కాదు. సామాన్య కార్యకర్తలు, టీనేజ్ యువత..” ఓహో.. తాము కూడా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చంద్రబాబు హర్షిస్తారేమో, కేసులు పెట్టించుకుంటే నారా లోకేష్ దృష్టిలో పడుతామేమో! ” అని భావించే అవకాశం ఉంది. తమ పార్టీ అధ్యక్షుడు భుజం మీద చేయి వేసి శభాష్ అంటే చాలు.. అందుకోసం ఏమైనా చేయాలన్న ఆలోచన ఉన్న వ్యక్తులు అన్ని పార్టీల్లోనూ ఉంటారు. అదో బలహీనత. దాన్ని అసరాగా చేసుకుని వారిని మరింత రెచ్చగొడితే ప్రమాదం. ఇప్పటికైనా తప్పు చేసిన వారిని బహిరంగంగా వెనుకేసుకురావడం చంద్రబాబు మానుకోవాల్సి అవసరం కనిపిస్తోంది.