ఏపీ కోటాలో నలుగురు వైసీపీ రాజ్యసభ సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న రాజ్యసభ ఎంపీ సీట్ల కోసం ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఏపీలో ఖాళీ అయిన నాలుగు స్థానాల కోసం నోటిఫికేషన్ జారీ చేయగా.. నలుగురు వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీ అసెంబ్లీలో అధికార వైసీపీకి ప్రస్తుతం 150 (మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం తర్వాత) మంది బలం ఉన్నది. దీంతో నాలుగు సీట్లు కూడా వైసీపీకే దక్కే అవకాశం ఉండటంతో ఇతర పార్టీలు తమ అభ్యర్థులను […]

Advertisement
Update:2022-06-03 13:39 IST

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న రాజ్యసభ ఎంపీ సీట్ల కోసం ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఏపీలో ఖాళీ అయిన నాలుగు స్థానాల కోసం నోటిఫికేషన్ జారీ చేయగా.. నలుగురు వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీ అసెంబ్లీలో అధికార వైసీపీకి ప్రస్తుతం 150 (మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం తర్వాత) మంది బలం ఉన్నది. దీంతో నాలుగు సీట్లు కూడా వైసీపీకే దక్కే అవకాశం ఉండటంతో ఇతర పార్టీలు తమ అభ్యర్థులను నిలపలేదు.

వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, ఎస్‌. నిరంజన్ రెడ్డి, ఆర్. కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారంతో నామినేషన్ పత్రాల పరిశీలన, ఉపసంహరణ గడువు ముగియడంతో నామినేషన్ వేసిన నలుగురు ఏకగ్రీవంగా గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి, శాసనమండలి ఉప కార్యదర్శి పి.వీ. సుబ్బారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆ నలుగురికి గెలిచినట్లు ధ్రువీకరణ పత్రాలు అందించారు.

Tags:    
Advertisement

Similar News