ఆత్మకూరు కమలం అభ్యర్థిగా భరత్‌ !

ఆత్మకూరు ఉప ఎన్నికలో నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం వైసీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతారనేది ఇంకా సస్పెన్స్‌గా ఉంది. నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్‌ కుమార్‌ను ఆత్మకూరు అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఆత్మకూరు ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక ముగ్గురు సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి నేతృత్వంలోని కమిటీ ముగ్గురు పేర్లును సూచించింది. అయితే వీరిలో […]

Advertisement
Update:2022-06-03 03:15 IST

ఆత్మకూరు ఉప ఎన్నికలో నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం వైసీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతారనేది ఇంకా సస్పెన్స్‌గా ఉంది.

నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్‌ కుమార్‌ను ఆత్మకూరు అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఆత్మకూరు ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక ముగ్గురు సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి నేతృత్వంలోని కమిటీ ముగ్గురు పేర్లును సూచించింది. అయితే వీరిలో భరత్‌కుమార్‌ వైపే బీజేపీ నేతలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

భరత్‌కుమార్‌ ఏబీవీపీ నుంచి ఎదిగారు. స్టూడెంట్‌ రాజకీయాల నుంచి యాక్టివ్‌గా ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు. 2014 నుంచి 2019 వరకు కావాలి మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌గా ఉన్నారు., ఆ సమయంలోనే మున్సిపల్‌ ఛైర్మన్‌ అలేఖ్య కొన్ని వివాదాల్లో చిక్కుకుని పదవి నుంచి తప్పుకోవడంతో ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు.

విక్రమ్‌ రెడ్డి ఆస్తులు రూ. 110.37 కోట్లు
వైసీపీ అభ్యర్థి విక్రమ్‌ రెడ్డి నామినేషన్‌ అఫిడవిట్‌ ప్రకారం ఆయన ఆస్తి 110.37 కోట్లు. స్థిరాస్థిల విలువ 22.93 కోట్లు ఉంటే.. చరాస్తుల విలువ 87.43 కోట్లు. అంతేకాదు ఆయనపై ఐదు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కేరళలోని కొచ్చిలో ఏసీబీ కేసుతో పాటు త్రిసూర్‌, పిచీలో మరో రెండు కేసులు.. హైదరాబాద్‌ రాయదుర్గం పీఎస్‌లో మరో కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లో మీరట్‌ జిల్లా ట్రాన్స్‌పోర్టు నగరలో మరో కేసు రికార్డు అయింది.

Tags:    
Advertisement

Similar News