పోలవరంపై చర్చకు సిద్ధమా? – నీటి పారుదల శాఖ మంత్రి అంబటి సవాల్
పోలవరం ప్రాజెక్టుపై అధికార, ప్రతిపక్షపార్టీలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. తప్పు మీదంటే మీదేనంటూ నాయకులు ఆరోపించుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఈ అంశంపై మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుపై చర్చించేందుకు తాము సిద్ధమని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఎప్పుడొచ్చిన తాను మాట్లాడతానని సవాల్ విసిరారు. ఈ ప్రాజెక్టు జాప్యం కావడానికి ముమ్మాటికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని స్పష్టం చేశారు. కాపర్ డ్యాం నిర్మించకుండా డయాప్రంవాల్ కట్టడం వల్లే ప్రాజెక్టు […]
పోలవరం ప్రాజెక్టుపై అధికార, ప్రతిపక్షపార్టీలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. తప్పు మీదంటే మీదేనంటూ నాయకులు ఆరోపించుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఈ అంశంపై మాట్లాడారు.
పోలవరం ప్రాజెక్టుపై చర్చించేందుకు తాము సిద్ధమని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఎప్పుడొచ్చిన తాను మాట్లాడతానని సవాల్ విసిరారు. ఈ ప్రాజెక్టు జాప్యం కావడానికి ముమ్మాటికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని స్పష్టం చేశారు.
కాపర్ డ్యాం నిర్మించకుండా డయాప్రంవాల్ కట్టడం వల్లే ప్రాజెక్టు ఆలస్యమవుతోందని పేర్కొన్నారు. చంద్రబాబు గతంలో డబ్బులకు కక్కుర్తి పడి కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. డయాప్రంవాల్ కు మరమ్మతులు చేపట్టాలా? లేదంటే కొత్తగా నిర్మించాలా? అన్న విషయంపై అందరూ తలలు పట్టుకుంటున్నారని మండిపడ్డారు.