డీజీపీని కలవనున్న పవన్ కళ్యాణ్

ఏపీలో జనసేన కార్యకర్తలు, నాయకులపై వేధింపులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమలాపురం అల్లర్ల కేసుల్లో తమ కార్యకర్తలను ఇరికిస్తున్నారని, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులపై పోలీసుల వేధింపులకు అడ్డూ ఆపూ లేకుండా పోయిందని ఆపార్టీ సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ విషయాన్ని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ రాజకీయ వ్యవహారాల […]

Advertisement
Update:2022-06-01 02:51 IST

ఏపీలో జనసేన కార్యకర్తలు, నాయకులపై వేధింపులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమలాపురం అల్లర్ల కేసుల్లో తమ కార్యకర్తలను ఇరికిస్తున్నారని, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులపై పోలీసుల వేధింపులకు అడ్డూ ఆపూ లేకుండా పోయిందని ఆపార్టీ సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ విషయాన్ని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించిందని, ఇందులో భాగంగా అపాయింట్‌మెంట్ కోసం లేఖ రాసిందని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

డీజీపీతో అపాయింట్‌మెంట్ ఖరారు కాగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేతృత్వంలోని నాయకుల బృందం డీజీపీని కలుస్తుందని మనోహర్ వివరించారు. డీజీపీని కలిసి కార్యకర్తలు, నాయకులపై మోపుతున్న అక్రమ కేసులను ఆయన దృష్టికి తీసుకెళ్తామ‌ని, వారికి రక్షణ కల్పించాల్సిందిగా కోరుతారని పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News