కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు అండగా ఏపీ ప్రభుత్వం..!

ప్రపంచవ్యాప్తంగా గత మూడేళ్ళలో కరోనా సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఈ వైరస్ కారణంగా ఎన్నో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో కూడా ఎంతోమంది ఈ మహమ్మారి వల్ల మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ సమయంలో మరణాల సంఖ్య అధికంగా నమోదయింది. కరోనాతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో ఎంతో మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. ఇలా కరోనా వల్ల అనాథలుగా మారిన పిల్లలను […]

Advertisement
Update:2022-05-31 07:43 IST

ప్రపంచవ్యాప్తంగా గత మూడేళ్ళలో కరోనా సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఈ వైరస్ కారణంగా ఎన్నో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో కూడా ఎంతోమంది ఈ మహమ్మారి వల్ల మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ సమయంలో మరణాల సంఖ్య అధికంగా నమోదయింది. కరోనాతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో ఎంతో మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. ఇలా కరోనా వల్ల అనాథలుగా మారిన పిల్లలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. కోవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు కేంద్రం పీఎం కేర్స్ తరపున రూ. 10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేస్తోంది.

కరోనా కారణంగా అనాథలైన పిల్లల సంక్షేమం, సహాయం విషయమై సోమవారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పీఎం కేర్స్ కు అర్హులైన పిల్లలను ఆదుకోవాలని ఆయా రాష్ట్రాల అధికారులకు సూచనలు చేశారు. దీనిపై ఏపీ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ ఎస్ సిరి మాట్లాడుతూ కరోనా కారణంగా అనాథలైన పిల్లలకు కేంద్ర ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున సహాయం అందజేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తం చొప్పున బాధితులకు సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు.

కోవిడ్ బాధిత పిల్లలకు 23 సంవత్సరాలు వయసు వచ్చేవరకు వారి సంరక్షణ, ప్రయోజనాలను కాపాడటం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో కోవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయిన 351 మంది పిల్లలను అర్హులుగా ఎంపిక చేసినట్లు ఆమె తెలిపారు. కోవిడ్ బాధిత పిల్లల విద్య కోసం కేజీబీవీ, సైనిక్, నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ప్రాధాన్యం కూడా కల్పించనున్నట్లు ఆమె చెప్పారు.

Tags:    
Advertisement

Similar News