ఆ జనం బలం కాదు.. వాపు
వైసీపీ, టీడీపీ తమ బలాన్ని ప్రదర్శించేందుకు ఇటీవల రకరకాలుగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. టీడీపీ బాదుడే బాదుడు అంటోంది. మహానాడును బహిరంగ సభ తరహాలో నిర్వహించారు. భారీగా తమకు స్పందన వస్తోంది.. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతే ఇందుకు కారణమని టీడీపీ అంటోంది. అటు వైసీపీ గడప గడపకు తిరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రులతో బస్సు యాత్ర చేయిస్తోంది. రెండు పార్టీల కార్యక్రమాల్లోనూ సందడి బాగానే కనిపిస్తోంది. కానీ వస్తున్న వారు ఎవరు?. వీళ్లు సామాన్య ప్రజలా? లేక కార్యకర్తలా?. […]
వైసీపీ, టీడీపీ తమ బలాన్ని ప్రదర్శించేందుకు ఇటీవల రకరకాలుగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. టీడీపీ బాదుడే బాదుడు అంటోంది. మహానాడును బహిరంగ సభ తరహాలో నిర్వహించారు. భారీగా తమకు స్పందన వస్తోంది.. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతే ఇందుకు కారణమని టీడీపీ అంటోంది. అటు వైసీపీ గడప గడపకు తిరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రులతో బస్సు యాత్ర చేయిస్తోంది.
రెండు పార్టీల కార్యక్రమాల్లోనూ సందడి బాగానే కనిపిస్తోంది. కానీ వస్తున్న వారు ఎవరు?. వీళ్లు సామాన్య ప్రజలా? లేక కార్యకర్తలా?. ఎక్కువగా కార్యకర్తలే ఉంటున్నారు. సామాన్య ప్రజలెవరూ వచ్చినా వారు జెండాలు పట్టుకుని నిలబడరు. నిశితంగా నేతల ప్రసంగాలను గమనిస్తుంటారు. కానీ ఈ రెండు పార్టీల కార్యక్రమాలు ఆ తరహాలో లేవు.
మహానాడుకు వచ్చిన స్పందనను చూపెట్టి.. ఇక వచ్చేశాం అధికారంలోకి అన్నట్టుగా టీడీపీ తీరు ఉంది. కానీ మహానాడు వచ్చేది టీడీపీ కార్యకర్తలు. పైగా మహానాడు వద్ద కూర్చున్న వారి శరీరం మీదే స్పష్టంగా పసుపు వస్త్రాలు కనిపిస్తున్నాయి. టీడీపీ కార్యకర్తల్లో ఊపు వచ్చిన మాట వాస్తవమే. అందుకు ప్రధాన కారణం నిరంతరం టీడీపీ కేడర్‌ను ఆ పార్టీ నాయకత్వం ఉత్సాహపరుస్తున్న తీరే. మీడియా కూడా టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చేస్తోంది అన్నట్టుగా ప్రచారం చేస్తోంది. ఇవన్నీ సహజంగానే టీడీపీ కేడర్‌లో కృత్తిమంగానైనా ఊపును తెచ్చాయి.
ఇక వైసీపీ తీరు కాస్త భిన్నంగానే ఉంది. కేడర్‌లెస్ పార్టీగా, నగదు బదిలీ పథకాలపై నమ్మకంతో తనదైన పంథాలో వైసీపీ వెళ్తోంది. ఎస్సీఎస్టీబీసీ మంత్రులు పర్యటన చేస్తుంటే.. వారి రాక సందర్భంగా జనం కనబడేలా చేసే బాధ్యతను స్థానికంగా ఉండే బలమైన ఎమ్మెల్యేలకు అప్పగించారు. అధికారుల సాయమూ తీసుకుంటున్నారు. దాంతో ఎమ్మెల్యేలు తలోచేయి వేసి బస్సు యాత్రలో సందడిని తీసుకొస్తున్నారు. ఉపాధి హామీ కూలీలను తీసుకొచ్చి అధికారులు తమ వంతు సహకారం అందిస్తున్నారు.
ఇలా టీడీపీ, వైసీపీ కార్యక్రమాల్లో స్పందనను లోతుగా పరిశీలిస్తే.. ఇవి సామాన్య ప్రజల స్వచ్చంద స్పందనను పరిశీలించే వేదికలుగా మాత్రం లేవు. ఇవి పూర్తిగా కార్యకర్తలు, నేతల హంగామా కార్యక్రమాలే. వీటికి వస్తున్న స్పందన బట్టే జనంనాడిని అంచనా వేయలేం.
ALSO REDA: జిల్లాల విభజనను సమీక్షిస్తాం.. రాజకీయ విభజనలు సరిచేస్తాం..