తప్పులకుప్ప విరాట్ కొహ్లీ!

విరాట్ కొహ్లీ.. రెండేళ్ల క్రితం వరకూ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్. క్రికెట్ ఫార్మాట్ ఏదైనా కొహ్లీ తర్వాతే ఎవరైనా. సాంప్రదాయ టెస్ట్ క్రికెట్, ఇన్ స్టంట్ వన్డే క్రికెట్, ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్..ఫార్మాట్ ఏదైనా ఒకేతీరుగా రాణిస్తూ వచ్చాడు. పరుగుల జోరు, సెంచరీల హోరుతో రికార్డుల మోత మోగిస్తూ వచ్చాడు. అయితే..గత రెండు సంవత్సరాలుగా విరాట్ కొహ్లీని వైఫల్యాలు వెంటాడుతూ వస్తున్నాయి. చివరకు ఐపీఎల్ 15వ సీజన్ లో సైతం విరాట్ వెలవెలా బోయాడు. 2016లో […]

Advertisement
Update:2022-05-29 01:35 IST

విరాట్ కొహ్లీ.. రెండేళ్ల క్రితం వరకూ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్. క్రికెట్ ఫార్మాట్ ఏదైనా కొహ్లీ తర్వాతే ఎవరైనా. సాంప్రదాయ టెస్ట్ క్రికెట్, ఇన్ స్టంట్ వన్డే క్రికెట్, ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్..ఫార్మాట్ ఏదైనా ఒకేతీరుగా రాణిస్తూ వచ్చాడు. పరుగుల జోరు, సెంచరీల హోరుతో రికార్డుల మోత మోగిస్తూ వచ్చాడు. అయితే..గత రెండు సంవత్సరాలుగా విరాట్ కొహ్లీని వైఫల్యాలు వెంటాడుతూ వస్తున్నాయి. చివరకు ఐపీఎల్ 15వ సీజన్ లో సైతం విరాట్ వెలవెలా బోయాడు.

2016లో సూపర్ హిట్..2022లో అట్టర్ ఫ్లాప్!
2016 సీజన్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ గా విరాట్ కొహ్లీ సాధించిన పరుగులు 973. అందులో నాలుగు శతకాలు సైతం ఉన్నాయి. అదే ప్రస్తుత 2022 సీజన్లో కొహ్లీ ఆడిన మ్యాచ్ లు 16. సాధించిన పరుగులు 341 మాత్రమే. ఎక్కడ 973…ఎక్కడ 341 పరుగులు. విరాట్ కొహ్లీ బ్యాటింగ్ ఎందుకిలా తయారయ్యింది? ఏమిటీ వరుస వైఫల్యాలు? అన్నప్రశ్నలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు..విరాట్ కొహ్లీ ఆటతీరు లోని లోపాలను, ఆత్మవిశ్వాసం లేమికీ కారణాలను వెలికితీసే పనిలో క్రికెట్ విమర్శకులు, విశ్లేషకులు మొదలు పెట్టారు.

తప్పులు.. అవే తప్పులు!
విరాట్ కొహ్లీ బ్యాటింగ్ అంటే ఆత్మవిశ్వాసానికి, కచ్చితత్వానికి మరోపేరు. అయితే ..అది 2020కి ముందుమాట. ప్రస్తుతం కొహ్లీ ఆటతీరులోని లోపాలు, ఫుట్ వర్క్ లో డొల్లతనం బయటపడుతున్నాయి.
వికెట్ కు వెలుపలాగా వెళుతున్న బంతులను వెంటాడటం, వికెట్ల మీదకు వచ్చే బంతులను ఆడకుండా విడిచిపెట్టి అడ్డంగా దొరికిపోడం లాంటి లోపాలతో కొహ్లీ తక్కువ స్కోర్లకే వెనుదిరగాల్సి వస్తోంది.
ప్రస్తుత సీజన్లో భాగంగా బెంగళూరుజట్టు ఆడిన మొత్తం 16 మ్యాచ్ ల్లో కొహ్లీ ప్రారంభంలో వన్ డౌన్ స్థానంలోనూ..ఆ తర్వాత నుంచి ఓపెనర్ గానూ బ్యాటింగ్ కు దిగినా చేసిన తప్పులే చేస్తూ భారీమూల్యం చెల్లించాడు. 16 ఇన్నింగ్స్ లో మూడుసార్లు గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగాడు. రెండంటే రెండు మాత్రమే హాఫ్ సెంచరీలు సాధించాడు. 22.73 సగటుతో 341 పరుగులు సాధించడం ద్వారా..పతనం అంచులకు పడిపోయాడు. సీజన్ కు 20 లక్షలు మ్యాచ్ ఫీజుగా తీసుకొన్న రజత్ పాటీదార్ లాంటి అనామక ఆటగాళ్లు సెంచరీలు, హాఫ్ సెంచరీలతో జట్టుకు అండగా నిలిస్తే..ఐకాన్ ప్లేయర్ హోదాలో సీజన్ కు 15 కోట్ల రూపాయలు అందుకొంటున్న కొహ్లీ మాత్రం అత్తెసరు పరుగులతో జట్టుగా భారంగా, అలంకరణగా మారాడు.

కొహ్లీ వైఫల్యాల వెనుక..
విరాట్ కొహ్లీ ప్రస్తుత సీజన్ కు ముందు వరకూ తన కెరియర్ లో చేసిన పొరపాట్లను కేవలం ప్రస్తుత సీజన్ మ్యాచ్ ల్లోనే చేయటమే ఈ ఘోరవైఫల్యానికి కారణమని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విశ్లేషించాడు. ప్రస్తుత సీజన్ మొత్తం 16 ఇన్నింగ్స్ లో కొహ్లీ.. ఎన్ని రకాలుగా అవుట్ కావచ్చో.. అన్నిరకాలుగానూ అవుటయ్యాడని.. గతంలో కొహ్లీకి..ప్రస్తుత కొహ్లీకి అసలు పొంతనే లేదని వివరించాడు. గత రెండేళ్లుగా కొహ్లీ ఆటతీరు గతి తప్పిందని, ఆత్మవిశ్వాసం కరువైపోయిందని వీరూ చెప్పాడు. మరో విశ్లేషకుడు పార్థివ్ పటేల్ మాటల్లో చెప్పాలంటే.. కొహ్లీలో ఆత్మవిశ్వాసం కొరవడిందని, పరుగులు చేయలేకపోడంతో అనవసరపు ఆందోళనలో పడిపోతూ..చెత్తషాట్లు ఆడుతూ వికెట్ పారేసుకొంటూ వస్తున్నాడు. కట్ షాట్ ఆడలేకపోడం కొహ్లీ బ్యాటింగ్ లో ప్రధాన బలహీనతగా కనిపిస్తోందని, వికెట్ కీపర్ క్యాచ్ లకు, స్లిప్ క్యాచ్ లకు దొరికిపోతున్నాడని పార్థివ్ గుర్తుచేశాడు.

బ్రేక్ తీసుకొంటే మంచిది- రవిశాస్త్రి
వరుస వైఫల్యాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న విరాట్ కొహ్లీ ఆటతీరులో పస, కసి లోపించాయని, గత కొద్దిసంవత్సరాలుగా అవిశ్రాంత క్రికెట్ ఆడుతూ వస్తున్న కొహ్లీ..మానసికంగా అలసిపోయాడని, దాని ప్రభావం అతని ఆటతీరులో కనిపిస్తోందని భారత మాజీ శిక్షకుడు, కొహ్లీ గురువు రవిశాస్త్రి చెప్పాడు. కొంతకాలం ఆటకు దూరంగా ఉంటే మేలని సలహా ఇచ్చాడు. బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ మాత్రం..కొహ్లీ గొప్ప ఆటగాడే కానీ..ప్రస్తుతం స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోతున్నాడంటూ తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. దక్షిణాఫ్రికాతో జరిగే ఐదుమ్యాచ్ ల సిరీస్ లో పాల్గొనే భారతజట్టుకు కొహ్లీ, రోహిత్ శర్మలను ఎంపిక చేయకుండా సెలెక్టర్లు విశ్రాంతి నివ్వడం..ఏపాటి మేలు చేస్తుందో మరి.
విరాట్ కొహ్లీ సాధ్యమైనంత త్వరగా వైఫల్యాల ఊబినుంచి బయటపడాలని అతని వీరాభిమానులు వేయి దేవుళ్లకు మొక్కుకొంటున్నారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

Tags:    
Advertisement

Similar News