ఎన్టీఆర్ ను ఎదిరించడం తప్పే!.. టీఆర్ఎస్ నేత మండవ వెంకటేశ్వరావు
టీఆర్ఎస్ నేత మండవ వెంకటేశ్వరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ను సీఎం పదవి నుంచి తొలగించడం, పార్టీ నుంచి బహిష్కరించిన సందర్భాన్ని గుర్తుచేసుకొని ఉద్వేగానికి గురయ్యారు. మండవ టీడీపీలో కీలక నేతగా ఎదిగిన విషయం తెలిసిందే. ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. కాగా శనివారం దివంగత సీఎం శతజయంతి వేడుకల్లో భాగంగా నిజామాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ధర్మారం (బీ) గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా […]
టీఆర్ఎస్ నేత మండవ వెంకటేశ్వరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ను సీఎం పదవి నుంచి తొలగించడం, పార్టీ నుంచి బహిష్కరించిన సందర్భాన్ని గుర్తుచేసుకొని ఉద్వేగానికి గురయ్యారు. మండవ టీడీపీలో కీలక నేతగా ఎదిగిన విషయం తెలిసిందే. ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. కాగా శనివారం దివంగత సీఎం శతజయంతి వేడుకల్లో భాగంగా నిజామాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ధర్మారం (బీ) గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ చాలా గొప్ప నేత. ఆయన ఏ ఒక్క సామాజికవర్గానికో చెందిన నేత కాదు. అన్ని వర్గాల ప్రజలకు ఆయన న్యాయం చేశారు. అందుకే ప్రజలు ఆయనను అదరించారు. మేము గతంలో ఎన్టీఆర్ ను ఎదిరించాల్సి రావడం నిజంగా దురదృష్టకరం. ఆరోజు గవర్నర్ ఆఫీసులో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా వ్యవహరించినప్పటికీ పలువురు ఎమ్మెల్యేలు ఆయన పాదాలమీద పడి క్షమాపణలు చెప్పారు. అది నిజంగా ఎన్టీఆర్ గొప్పతనం. అటువంటి గొప్పనేత చాలా అరుదు.
నేడు అన్ని పార్టీల్లోనూ ఆయన ప్రోత్సహించిన వారే ఉన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఆయన పెట్టిన పార్టీలోనే లీడర్లుగా ఎదిగారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో కూడా ఎందరో నేతలు టీడీపీ వాళ్లే ఉన్నారు. బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం తీసుకొచ్చేందుకు ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారు. అటువంటి నేతను స్మరించుకోవడం గొప్ప విషయం’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం మండవ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎన్టీఆర్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న రోజులను మండవ ప్రస్తావించడం గమనార్హం.